calender_icon.png 19 December, 2025 | 12:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీనే బలంగా ఉంది

19-12-2025 12:45:05 AM

  1. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సర్పంచులు...

బిఆర్‌ఎస్ పాలనలో సర్పంచులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు...

కాంగ్రెస్ పాలనలో నేడు సుస్థిర అభివృద్ధి కొనసాగుతోంది

విజయం సాధించిన సర్పంచ్లను, ఉపసర్పంచులను, వార్డు సభ్యులకు సన్మానం ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ,  

వనపర్తి, డిసెంబర్ 18 (విజయక్రాంతి) : గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ప్రస్తుతం జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో నిరూపణ అయిందని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి  పేర్కొన్నారు. గురువారం నంది హిల్స్ లోని తన నివాస కార్యాలయంలో పెబ్బేరు, శ్రీరంగాపురం, అడ్డాకుల మండలాల్లో మూడవ  విడతలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికలలో విజయం సాధించిన సర్పంచ్లను, ఉపసర్పంచులను, వార్డు సభ్యులను, ఎమ్మెల్యే  శాలువాలతో  సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎవరు ఎన్ని ఎత్తుగడలు వేసిన నీచ రాజకీయాలు చేసిన గ్రామాలలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారని కాంగ్రెస్ పార్టీ తరపున నిలబడిన సర్పంచులను వార్డు సభ్యులను పెద్ద ఎత్తున గెలిపించారన్నారు. గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు భారీ ఎత్తున గెలిచారని, మరోపక్క కాంగ్రెస్ పార్టీ తరఫున స్వతంత్రులుగా నిలిచిన అభ్యర్థులకు సైతం అధిక మొత్తంలో ఓట్లు పోలయ్యాయని ఈ ప్రకారంగా చూసుకుంటే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

గత పదేళ్ల బి ఆర్ ఎస్ పాలనలో గ్రామాలు పూర్తిగా నిర్వీర్యమైపోయాయని గ్రామాభివృద్ధికి పాటుబడిన సర్పంచులు ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ప్రస్తుతం విజయం సాధించిన సర్పంచులు, ఉప సర్పంచ్లు వార్డు సభ్యులు గ్రామంలోని ప్రతి సమస్యను గుర్తించి పరిష్కరించేలా పనిచేయాలని ప్రతి ఒక్కరికి తాను ఎల్లవేళలా అందుబాటులో ఉండే గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తానని ఎమ్మెల్యే వారికి సూచించారు. కార్యక్రమంలో ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.