calender_icon.png 19 December, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రూప్-3 పోస్టుల ఎంపిక జాబితా విడుదల

19-12-2025 12:49:09 AM

  1.   1,388 పోస్టులకు 1,370 మంది ఎంపిక
  2. హోల్డ్‌లో మరో 17 పోస్టులు
  3. వాటి ఫలితాలు తర్వాత వెల్లడిస్తామన్న టీజీపీఎస్సీ

హైదరాబాద్, డిసెంబర్ 18 (విజయక్రాంతి): గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన వారి జాబితాను గురువారం టీజీపీఎస్సీ అధికారులు విడుదల చేశారు. మొత్తం పోస్టులు 1,388 ఉండగా 1,370 మందిని ఎంపిక చేసి, జాబితా విడుదల చేశారు. హోల్డ్‌లో మ రో 17 పోస్టులు ఉంచిన అధికారులు.. వాటి భర్తీకి సంబంధించిన ఫలితాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. 1,370 పోస్టులకు అభ్యర్థుల ఎంపిక జాబితా ప్రొవిజినల్ నోటిఫికే షన్‌ను టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో అందు బాటులో ఉంచారు.

2024 నవంబరులో జ రిగిన గ్రూప్ -3 పరీక్షలకు 2.67లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఇంతకుముందే జనరల్ ర్యాంకింగ్స్, మెరిట్ జాబితాను టీజీపీఎస్సీ విడుదల చేయగా.. వెబ్ ఆప్షన్లు, అభ్యర్థులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ చేపట్టి గురువారం ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచా రు. అందులో ఎంపికైన వారి హాల్‌టికెట్ నంబర్లు, పోస్టు కోడ్, ప్రాంతం వివరాలు ఉన్నాయి.