11-09-2025 11:24:11 PM
అదొక్కటే గుర్తొస్తూ ఉంటుంది!
తేజ సజ్జా(Teja Sajja) సూపర్ హీరోగా నటిస్తున్న మరో విజువల్ వండర్ చిత్రం ‘మిరాయ్’. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మనోజ్ మంచు పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ భారీస్థాయిలో నిర్మించారు. సెప్టెంబర్ 12న (శుక్రవారం) ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా కథానాయకుడు తేజ సజ్జా చెప్పిన సినిమా విశేషాలివీ..
‘హను ఈ సినిమాకు మీలో వచ్చిన మార్పేంటి?
ఏమీ లేదండి.. సినిమాకు పడే కష్టంలో ఎలాంటి తేడా లేదు. ఇంతకుముందు ఎలాగైతే కొత్తరకం సినిమాలు చేయాలని అనుకున్నానో ఇప్పుడూ ఆ ప్రయత్నంలోనే ఉన్నా. ‘హను ఎంత ఎఫర్ట్ పెట్టానో దాని కంటే ఎక్కువ ‘మిరాయ్’కి పెట్టాను. నిజానికి ‘హను విషయంలోనే చాలా ఒత్తిడి ఉండేది. నేను సక్సెస్‌ను ఆపాదించుకోను. ఒక సినిమాకు మించి ఇంకో సినిమా చేయాలనే అంచనాలు ఏమీ ఉండవు. ఏ సినిమాకు ఆ సినిమానే ప్రత్యేకం. ఒక సినిమాకు 100 శాతం ఎఫర్ట్ పెడుతున్నానా.. లేదా చూసుకుంటాను. ఒక్క గొప్ప వర్క్ చేయాలనే ఒత్తిడి తప్పితే ‘హను వల్ల వచ్చిన ఒత్తిడి ఏమీలేదు.
‘హను గొప్ప విజయం వచ్చింది కదా.. ఆ ఫలితాన్ని చూసి ఈ సినిమాలో ఏమైనా మార్పులు చేశారా?
-లేదండి. ముందు ఈ సినిమాను ఏ స్కేల్లో అనుకున్నామో ఆ స్కేల్‌లోనే తీశాం. పాన్‌ఇండియన్ అని స్క్రిప్ట్‌లో మార్పులు చేసేద్దాం అని ఆలోచన ఎప్పుడూ లేదు. నా మెయిన్ గ్రౌండ్ తెలుగు ప్రేక్షకులు. మనకోసం తీసిన సినిమా ఇది. ఇతర భాషల్లో ఆడితే ఆనందం. నేను మాత్రం తెలుగు ప్రేక్షకుల కోసమే సినిమాలు చేస్తాను.
‘మిరాయ్’లో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
-ఒక మామూలు కుర్రాడు తన ధర్మాన్ని తెలుసుకొని, తనకు యోధులకు ఉన్న అనుబంధాన్ని తెలుసుకుని, ఒక పెద్ద ఆపదను ఆపడానికి.. తన తల్లి ఆశయం కోసం ఎంత దూరం వెళ్తాడనేది మా సినిమాలో చూడొచ్చు. ఇతిహాసాల్లో ఉన్న సమాధానం కోసం జర్నీ చేసే క్యారెక్టర్‌లో కనిపిస్తాను.
ఇందులో ఛాలెంజింగ్ అనిపించిన యాక్షన్ బ్లాక్ ఏమిటి?
-మొత్తం దాదాపు 9 యాక్షన్ బ్లాక్ ఉన్నాయి. ప్రతి యాక్షన్ సీక్వెన్స్ దేనికదే చాలెంజ్. ఎన్ని రిస్కులు, ఛాలెంజ్‌లు తీసుకున్నా సరే.. ప్రేక్షకులు రిలీజ్ రోజు ఎంత థ్రిల్ అవుతారు.. అదొక్కటే గుర్తొస్తుంటుంది.
మంచు మనోజ్ పాత్ర ఎలా ఉండబోతోంది?
-మనోజ్ చాలా పవర్‌ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఒక జీవితాన్ని చూసి వచ్చిన పాత్ర. ఆ పాత్రకు ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఒక పెద్ద డేంజర్ క్రియేట్ చేయగల క్యారెక్టర్. హీరో ఎలా ఎదుర్కోగలడు అనిపించేలా ఉండే క్యారెక్టర్.
ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీ నుంచి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి?
-చిరంజీవి గారు ఒక పెద్ద మెసేజ్ పెట్టడం చాలా ఆనందాన్నిచ్చింది. అలాగే నాని అన్న కూడా ఒక మంచి మెసేజ్ పెట్టారు. చాలామంది దర్శకులు ఎన్నో మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు.
‘మిరాయ్’లో శ్రీరాముల వారి నేపథ్యం ఎలా ఉంటుంది?
-మన ఇతిహాసాలతో చాలా ఆర్గానిక్‌గా బ్లెండ్ అయిన కథ ఇది. బలవంతంగా ఇరికించింది కాదు. అది చిన్న పోర్షన్ ఉన్నప్పటికీ, వచ్చినప్పుడు స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అలాగే ఈ సినిమాలో రెండు సర్‌ప్రైజ్‌లున్నాయి.
‘మిరాయ్2’ చేసే ఆలోచన ఉందా?
సినిమా హిట్ అయితే కచ్చితంగా ‘మిరాయ్’ ఫ్రాంచైస్ అయ్యే పొటెన్షియల్ ఉన్న ప్రాజెక్టు. ప్రేక్షకులు ఆదరిస్తే కచ్చితంగా పార్ట్ 2 వస్తుంది.
కొత్తగా చేయబోతున్న సినిమాలు..?
-నేను ఒక సినిమా కమిట్ అయితే అది పూర్తయి రిలీజ్ అయినంత వరకు దానిపైనే ఉంటాను. అందుకే ప్యుచర్ సినిమాలు గురించి ఆలోచించే అంత స్పేస్ ఉండటం లేదు. ప్రేక్షకుల్లో క్రెడిబిలిటీ సంపాదించడంపైనే నా దృష్టి ఉంటుంది. సినిమా రిలీజ్ సమయంలో ప్రేక్షకులను థియేటర్లకు పిలిచేటప్పుడు ముందు నేను కాన్ఫిడెంట్‌గా ఉండాలి. -ప్రస్తుతానికి ‘జాంబిరెడ్డి2’ ఒక్కటే కమిట్ అయ్యాను.
‘మిరాయ్’ గురించి ప్రేక్షకులకు ఏం చెప్తారు?
-‘మిరాయ్’ వెరీ క్లీన్ ఫ్యామిలీ ఫిలిం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు యాక్షన్, అడ్వెంచర్, ఫాంటసీ, ఎమోషన్, డివోషనల్, ఎలివేషన్.. అన్నీ ఉంటాయి. అందరికీ నచ్చే సినిమా ఇది. ముఖ్యంగా పిల్లల్ని ఎక్కువగా ఆకట్టుకునే సినిమా అవుతుంది. ఆడిటోరియం ఎక్స్‌పీరియన్స్ ఉన్న ఫిల్మ్ ఇది. ఒక ఇంటర్నేషనల్ స్థాయి సినిమా ఇవ్వాలని ఉద్దేశంతో వర్క్ చేశాం. దాన్ని సాధించామని భావిస్తున్నాం. ప్రేక్షకులందరూ అదే ప్రేమతో మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా.