12-09-2025 12:01:20 AM
గత ప్రభుత్వ హయాంలో మత్స్యకారుల అభివృద్ధికి ఉచిత చేప పిల్లల పంపిణీకి శ్రీకారం చుట్టింది. చెరువుల్లో చేప పిల్లలను వదిలి మత్స్యకారుల ఉపాధికి దోహదపడింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత చేప పిల్లల పంపిణీపై అలసత్వం వహిస్తోంది. మత్స్యకారుల అభివృద్ధి అగమ్య గొచర మేనా అన్న ప్రశ్న మ త్స్యకారుల నుండి ఉత్పన్నమవుతుంది.
వనపర్తి, సెప్టెంబర్ 11 ( విజయక్రాంతి ) : ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంపై నీలి నీడలు అలుముకున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ సర్కారు ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడంతో మత్స్యకారులందరు అయోమ యానికి గురవుతున్నారు. సీజన్ అదను దా టితే చేప పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూ పుతుంది. సర్కారు నుంచి చేప పిల్లల విత్త నం అందితే బాగుంటుందని అంతా భావిస్తున్నప్పటికీ నేటికీ క్లారిటీ లేక మత్స్యకారులు ఇబ్బందికి గురవుతున్నారు.
మత్స్య సహకార సంఘాల ద్వారా సొంతంగా నిధు లు వెచ్చించి చేప పిల్లలను కొనుగోలు చేయ డం భారీ ఖర్చుతో కూడుకున్న విషయం అందరికి తెలిసిందే. ప్రతి ఏ డాది మే నెలలో అధికారులు ప్రతిపాదనలు పంపి, జూన్, జూలైలో టెండర్లు పూర్తి చేస్తారు.
ఆగస్టు వరకు చెరువులు పూర్తి స్థాయిలో నిండి ఉంటాయి కాబట్టి చేప పిల్లలను చెరువుల్లోకి వదులుతా రు. కానీ రెండేండ్ల నుంచి చేప పిల్లల పంపిణీలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది దింతో సెప్టెంబర్ వచ్చినా ఇప్పటికీ టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. దీంతో వనపర్తి జిల్లాలలో చేప పిల్లల పంపిణీ ఉన్నట్టా..? లేనట్టా అని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
మత్య్సకారులకు చేకూరని లబ్ది..
చేప పిల్లల సరఫరాకు టెండర్ల ప్రక్రియ తీవ్ర జాప్యం జరుగుతోందని . సకాలంలో టెండర్లు ఖరారు చేయాల్సి ఉండగా ప్రతి ఏ డాది ఇదే తంతు కొనసాగుతుందని మత్య్సకారులు తమ ఆవేదన ను వ్యక్తం చేస్తున్నా రు. చేప పిల్లల సరఫరా, చెరువుల్లో పోయ డం ఆలస్యం కావడం వల్ల చేప పిల్లలు ఎదగక మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. ఉచిత చేప పిల్లల పంపిణీలో ఆల స్యం చేస్తే తగిన లబ్ధిచేకూరడం లేదని మత్య్సకారులు చెబుతున్నారు.
కిలో నుంచి రెండు మూడు కిలోల వరకు చేపలు ఎదగాలంటే చేప పిల్లలను ఆగస్టులోపు వదలాల్సి ఉం టుందని, అప్పుడే నాలుగు నెలల్లో వాటి వృ ద్ధి చెంది చేతికొస్తాయని చెబుతున్నారు. అ లాంటి చేపలకు మార్కెట్లో మంచి ధర వ స్తుందని, వాటిని ఎగుమతి చేయడానికి అ నుకూలంగా ఉంటుందని మత్స్యకారులు చె బుతున్నారు. సెప్టెంబర్లో పంపిణీ చేస్తే చేప పిల్లల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతుందని మత్స్యకారులు వాపోతున్నారు.
వనపర్తి జిల్లా వివరాలు ....
వనపర్తి జిల్లాలో 977 చెరువులు, 5 రిజర్వాయర్లు ఉన్నాయి. జిల్లా మొత్తం 143 మత్స్యకారుల సంఘాలు ఉండగా 13500 మం ది సభ్యులు ఉన్నారు. జిల్లా కు ప్రతి సంవత్సరం 2.28 కోట్ల లక్ష్యం ఉన్నపటికీ గత సంవత్సరం కేవలం 5 లక్షల 48 వేల 470 చేప పిల్లలను మాత్రమే చెరువులు, రిజర్వాయర్లలో వదిలారు. ఈ ఏడాది ఇప్పటి వరకు పంపిణి ప్రక్రియ మొదలు కూడా కాకపోవడం పట్ల మత్స్యకారులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.
కొనసాగుతున్న టెండర్ల ప్రక్రియ ....
చేప పిల్లల పంపిణి ప్రక్రియ కు సంబందించి టెండర్ల ప్రక్రియ ఈ నెల 15 లోగా పూర్తి అయితే తరువాత క్షేత్ర స్థాయి లో ఫీల్ అధికారులు పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పంపిణి కార్యక్రమం కు సంబందించిన పనులను చేపడుతాం.
లక్ష్మప్ప, మత్స్యకార శాఖ జిల్లా అధికారి, వనపరి