calender_icon.png 29 December, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీపై కాంగ్రెస్ ఘాటు విమర్శలు

29-12-2025 12:19:10 AM

ఎల్లారెడ్డి, డిసెంబర్ 28:(విజయక్రాంతి): ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఎల్లారెడ్డి క్యాంప్ కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్, రజిత వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాఠకుల వినోద్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి, పార్టీ శ్రేణులకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు గుప్పించారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, తెలంగాణకు రాష్ట్రం ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీయేనని గుర్తు చేశారు. ప్రజా పాలనతో ముందుకు సాగుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరును తొలగించేందుకు బీజేపీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా ఖండించారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరు రద్దు కుట్రలకు వ్యతిరేకంగా నేటి నుండి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ప్రకటించారు.

అనంతరం మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజిత రెడ్డి, పట్టణ అధ్యక్షుడు పాఠకుల వినోద్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తీసుకెళ్లేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ కృషితో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అదే ఉత్సాహంతో రానున్న మున్సిపల్, ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీ స్థానాలను, అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు.

స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ సహకారం, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు కృషి కారణమని పేర్కొన్నారు.. ప్రతి విషయంలో పార్టీ శ్రేణుల సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు సాగుతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రజిత వెంకటరామ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, మహిళా మండల అధ్యక్షురాలు వాసవి గౌడ్, పట్టణ అధ్యక్షులు వినోద్ గౌడ్, మాజీ సొసైటీ చైర్మన్ బోండ్ల సాయిలు, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సంతోష్ నాయక్, పోలీస్ నాగరాజు, శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, నాగం గోపికృష్ణ, కురుమ సాయిబాబా కాంగ్రెస్ కార్యకర్తలు, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహభరిత నినాదాలతో వేడుకలను విజయవంతం చేశారు.