05-08-2025 10:00:32 PM
కొత్తపల్లి,(విజయక్రాంతి): రాష్ట్రస్థాయి స్వచ్ఛంద సంస్థ, మెగా హెల్పింగ్ ఫౌండేషన్ హైదరాబాద్ వారు కీర్తి రత్న పురస్కారం, ఐకాన్ గోల్డెన్ టాలెంట్ అవార్డు సోషల్ స్కూల్ అసిస్టెంట్, మానువాడ శంకర్ కు సామజిక సేవలో సేవలందించినందుకు గాను అవార్డు రావడం జరిగింది. కొనియాడారు.లయన్స్ క్లబ్ గోల్డెన్ శాతవాహన తరపున ఘనంగా సన్మానం చేయడం జరిగింది.
ఈ సందర్బంగా లయన్స్ క్లబ్ గోల్డెన్ శాతవాహన అధ్యక్షులు లయన్ ననువాల గిరిధర్ రావు మాట్లాడుతూ సమాజంలో సమస్యలు గుర్తించి, ఆ సమస్యల పరిష్కారం కొరకు మానువాడ శంకర్ చొరవచూపేవారాని, ఈ అవార్డు రావడం సంతోషకరమైన విషయమని, వారు మన క్లబ్ సభ్యులు అవడం చాలా గర్వంగా ఉందని అన్నారు.