05-08-2025 09:56:59 PM
వివరాలు వెల్లడించిన డీసీపీ సురేష్ కుమార్
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): ఓ యువకుడిని గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా నరికి చంపారు. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్లమ్మ బండలోని గుడ్ విల్ హోటల్లో ఓ యువకుడు చాయ్ తాగుతున్నాడు. అదే సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి యువకుడిపై కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్య కేసుకు సంబంధించి వివరాలను డీసీపీ సురేష్ కుమార్ మంగళవారం మీడియాకు వెల్లడించారు.ముషీరాబాద్ కు చెందిన రౌడీ షీటర్ ఎమ్ డి. మహబూబ్(35)ను గుర్తుతెలియని దుండగులు కత్తులతో నరికి హత్య చేశారు. మహబూబ్ పై 13 కేసులు ఉన్నాయని, ఎక్కువగా దొంగతనాల కేసులు ఉన్నాయన్నారు.పటాన్చెరు లో ఒక మర్డర్ కేసు కూడా నమోదయ్యిందని వెల్లడించారు. నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.