05-08-2025 10:04:06 PM
స్క్రాప్ దుకాణాలపై అధికారుల పర్యవేక్షణ కరువు...
బచ్చన్నపేట,(విజయక్రాంతి): ప్రమాదంలో ఒకరు మృతి చెందిన పట్టించుకోని సంబంధిత అధికారులు జన నివాసాలకు దూరంగా ఉండాల్సిన స్క్రాప్ దుకాణాలు బచ్చన్నపేట మండల కేంద్రంలో నీ రహదారుల వెంట జనావాసాల మధ్య అనూహ్యంగా పెరుగుతున్నాయి. లక్షలు కురుపించే వ్యాపారం కావడంతో చాలా మంది దృష్టి ఈ వ్యాపారంపైకి మళ్లింది. ఫైర్ స్టేషన్, గ్రామపంచాయతీల అనుమతి లేకుండా నే నిబంధనలు కు విరుద్ధంగా వ్యాపారం సాగుతోంది.
వీటికి పన్ను కట్టక్కర్లేదు. జీఎస్టీ చెల్లింపులు పన్ను అక్కర్లేదని, పుట్టగొడుగుల్లా స్క్రాప్ దుకాణాలు ఏర్పాటవుతున్నాయి. తొలుత జీవనోపాధికి పెట్టుకున్న ఈ షాపులు క్రమేపీ వ్యాపార సామ్రాజ్యంగా విస్తరిస్తున్నాయి. ఒక్క మండల కేంద్రం లోనే పలుచోట్ల పలు రహదారుల వెంట దాదాపు స్ర్కాప్ దుకాణాలు ఉన్నాయి.. నిత్యం ఇవి పాత సామాన్లతో కిటకిటలాడుతుంటాయి. సాధారణంగా స్థానిక గ్రామ పంచాయతీ అనుమతితోనే స్ర్కాప్ దుకాణాలు ఏర్పాటుచేయాలి. జిల్లా నుండి ఫైర్ స్టేషన్ అనుమతి ఉండాలి. మండలంలో ఏర్పాటుచేస్తే తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. ఇది జరగడం లేదు. స్ర్కాప్ కొనుగోలు,