calender_icon.png 5 August, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేద కుటుంబానికి 20వేల ఆర్థిక సహాయం అందించిన హెల్పింగ్ హాండ్స్ సభ్యులు

05-08-2025 09:28:11 PM

దేవరకొండ: కొండమల్లేపల్లి పట్టణానికి చెందిన బీసీ కాలనీవాసి కుంభం వెంకటేష్ కుటుంబానికి కేఎంపి హెల్పింగ్ హాండ్స్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో మంగళవారం రూ.20 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.వెంకటేష్ భార్య కుంభం సుగుణ ఇటీవల అనారోగ్యంతో మరణించింది. పేద కుటుంబమైనా భార్యను బతికించుకోవాలనే తపనతో వైద్య ఖర్చులకు భారీగా ఖర్చు చేశారు. వీరికి ఐదు సంవత్సరాల పాప ఉంది. విషయం తెలుసుకున్న కేఎంపి హెల్పింగ్ హాండ్స్ వెల్ఫేర్ సొసైటీ సభ్యులు వెంకటేష్ కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.