calender_icon.png 5 August, 2025 | 11:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్య కార్మికులకు అవగాహన

05-08-2025 09:52:33 PM

భైంసా: జిల్లాలో మత్స్యకారుల ఆదాయం పెంచే లక్ష్యంతో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రామ్ గోపాల్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం (PMMSY)పై అవగాహన కార్యక్రమాలు మంగళవారం నిర్వహిస్తున్నారు. లోకేశ్వర్ మండలంలోని వివిధ కనకాపూర్, అబ్దుల్లాపూర్ గ్రామాల్లో సమావేశాలు నిర్వహించారు. కిసాన్ క్రెడిట్ కార్డులు, మత్స్యకార సంఘాలకు చెరువుల అభివృద్ధికి రుణాలు, మహిళల ఎస్హెచ్జీలకు మత్స్య వ్యవసాయానికి ఆర్థిక సాయం, వెసెల్స్, వలలు, ట్రాలర్ల కోసం బ్యాంకు రుణాలు తదితర అంశాలపై ఎల్డీఎం అవగాహాన కల్పించారు. ప్రైవేట్ వడ్డీదారుల వద్దకు వెళ్లకుండా బ్యాంకుల నుండి రుణాలు పొందాలని ఆయన కోరారు.