calender_icon.png 6 August, 2025 | 12:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

05-08-2025 09:49:03 PM

మండల వైద్యాధికారి నగేష్ నాయక్ 

జాజిరెడ్డిగూడెం: ఈనెల 11న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించనున్నామని, అట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల వైద్యాధికారి డాక్టర్ భూక్య నగేష్ నాయక్ కోరారు. పీహెచ్సీ అర్వపల్లి ఆధ్వర్యంలో మంగళవారం మండల కేంద్రం అర్వపల్లిలోని ఎంపీడీఓ కార్యాలయంలో మండలంలోని హెచ్ఎంలకు, అంగన్వాడీ టీచర్లు,ఆరోగ్య సిబ్బంది,ఆశాలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... మండలంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. 1 నుండి 19 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు భోజనం అనంతరం ప్రతి ఒక్కరికి ఒక్క మాత్రను అందజేయాలని చెప్పారు. వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించకపోవడం, కలుషిత ఆహారం, కలుషిత నీటి ద్వారా ఎక్కువగా నులిపురుగులు, కంకిపురుగులు, ఏలిక పాములు జీర్ణాశయంలోకి ప్రవేశించి రక్తం పీల్చడం వలన రక్తహీనత ఏర్పడి తరచూ అనారోగ్యానికి గురవుతామని తెలిపారు. ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత పాటించాలని కోరారు.