calender_icon.png 6 August, 2025 | 2:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి స్నేహితులు

05-08-2025 09:44:43 PM

జాజిరెడ్డిగూడెం: స్నేహితులు కేవలం సుఖాల్లోనే కాదు కష్టాల్లోనూ తోడుంటారని నిరూపించి మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచారు. వివరాల్లోకి వెళితే సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలంలోని కొమ్మాల గ్రామానికి చెందిన బొల్లెద్దు రమేష్ మాతృమూర్తి బొల్లెద్దు నాగమ్మ ఇటీవల మృతి చెందింది. మిత్రుని కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలవాలని తలచి 2000-2001 బ్యాచ్ స్నేహితులు మంగళవారం గ్రామంలో రమేష్ ను పరామర్శించి తమవంతు తక్షణసాయంగా రూ.15వేల ఆర్థిక సహాయాన్ని అందజేసి, భవిష్యత్తులో కూడా అతని కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.