calender_icon.png 15 September, 2025 | 6:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంగన్వాడీ వ్యవస్థను నిర్వీర్యం చేసే కుట్రలు మానుకోవాలి

15-09-2025 05:12:33 PM

నల్గొండ టౌన్,(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ప్రీ ప్రైమరీ స్కూలును ప్రవేశపెట్టి అంగన్వాడీ వ్యవస్థను పరోక్షంగా నిర్వీర్యం చేసే కుట్రను తిప్పి కొట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు.సోమవారం అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్  రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నల్లగొండ పెద్ద గడియారం సెంటర్లో మంత్రి క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా వీరారెడ్డి మాట్లాడుతూ ప్రీ ప్రైమరీ, పి.ఏం.శ్రీ విద్యను అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహించాలని, బోధనా బాధ్యత అంగన్వాడీ ఉద్యోగులకు కల్పించాలని,ఎఫ్ ఆర్ ఎస్ ను రద్దు చేస్తూ ఒకే ఆన్లైన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని,5 జి నెట్వర్క్ కలిగిన మొబైల్ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ మానిపోస్ట్ లో పెట్టిన అంగన్వాడీల వేతనం 18 వేలు, పి.ఎఫ్.అమలు చేయాలని,ఐసిడిఎస్ మంత్రి  హామీ ప్రకారం 24 రోజుల సమ్మె కాలం వేతనాలు ఇవ్వాలని,రిటైర్మెంట్ జి ఓ 8 ను సవరించి పెంచిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ తక్షణమే అమలు చేయాలని కోరారు. 3 నెలల పీఆర్సీ, మినీ టీచర్స్ కు 11 నెలల ఏరియర్స్ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్మెంట్ అయిన వాళ్ళకు 10 నెలల సిబిఈ బకాయిలు వెంటనే చెల్లించాలని,ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. అంగన్వాడీ వ్యవస్థను పరోక్షంగా నిర్వీర్యం చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. అంగన్వాడి లా సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అందులో భాగంగా సెప్టెంబర్ 25 న చలో సెక్రటేరియట్ జరుగుతుందని ఎన్ని నిర్బంధాలు ఎదురైనా హైదరాబాద్ కు వెళ్లాలని పిలుపునిచ్చారు.

అక్టోబర్ 8 న రాష్ట్ర వ్యాప్త సమ్మె,జిల్లా కేంద్రాలలో 5 కిలోమీటర్లు పాదయాత్రలు చేయాలని,17 నుండి ఫోన్లు అధికారులకు ఇచ్చేసి రిజిస్టర్స్ లో రాస్తూ ఆన్లైన్ సమ్మె నిర్వహించాలని రాష్ట్ర కమిటి నిర్ణయించినదాని అంగన్వాడీలంతా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పొడిసెట్టి నాగమణి, కార్యదర్శి బొందు పార్వతి, వర్కింగ్ ప్రెసిడెంట్ కె విజయలక్ష్మి, భువనగిరి జిల్లా కార్యదర్శి రమ, ఉపాధ్యక్షులు మణెమ్మ వివిధ ప్రాజెక్టు అధ్యక్ష కార్యదర్శులుపాల్గొన్నారు.