calender_icon.png 15 September, 2025 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెన్షనర్ల మహా ధర్నాకు రిటైర్డ్ కార్మికుల సంఘీభావం

15-09-2025 05:08:45 PM

మందమర్రి,(విజయక్రాంతి): రిటైర్డ్ బొగ్గుగని ఉద్యోగులకు కరువు బత్యంతో కూడిన పెన్షన్ అమలు చేయాలని, కనీస పెన్షన్ 15 వేలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో  కోల్ కత్త లో నిర్వహిస్తున్న  మహాధర్నాకు మద్దతుగా ఏరియా సింగరేణి రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా నిర్వ హించారు. పట్టణం లోని అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి  మహాధర్నాకు సంఘీభావంగా ధర్నా చేపట్టారు.ఈ సందర్భంగా పెన్షనర్స్ మాట్లాడుతూ  2017లో రిటైర్డ్ అయిన కార్మికులకు గ్రాట్యుటీ 20 లక్షలు అధికారులకు ఇచ్చిన విధంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగుల వైద్య సౌకర్యం కోసం అమలు చేస్తున్న సిపిఆర్ఎంఎస్ కార్డు 25 లక్షలు ఇవ్వాలని, రిటైర్డ్ కార్మికులకు సొంతింటి పథకం అమలు చేయాలన్నారు.