15-09-2025 05:14:52 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ మునిమంద స్వరూప- రమేష్ కుటుంబాన్ని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పరామర్శించారు. ఇటీవల మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ మునిమంద స్వరూప తండ్రి మాదరబోయిన రాజం ఇటీవల అనారోగ్యం తో మృతిచెందారు.దీంతో సోమవారం మధ్యాహ్నం ఎంపీ వంశీ కృష్ణ బెల్లంపల్లి పట్టణం లోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మునిమంద రమేష్ నివాసానికి చేరుకుని స్వరూప, కుటుంబీకులను పరామర్శించారు.రాజం మృతికి ఎంపీ ప్రగాఢ సానుభూతిని,సంతాపాన్ని వ్యక్తం చేశారు.