calender_icon.png 16 November, 2025 | 4:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్జాతీయ స్థాయిలో ఫోర్త్‌సిటీ నిర్మాణం

01-12-2024 02:30:32 AM

  1. ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
  2. మహేశ్వరంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మహేశ్వరం, నవంబర్ 30: రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో రూ.69 కోట్ల నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు శనివారం మంత్రి శంకుస్థాపన చేశారు.

మంత్రి మాట్లాడుతూ.. ముచ్చర్లలో నిర్మించబోయే ఫోర్త్‌సిటీలో భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం జల్‌పల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలు, బడంగ్‌పేట్ కార్పొరేషన్ పరిధిలో ౩ యూపీహెచ్‌సీ వైద్యశాలల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే సబితారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ ఇన్‌చార్జి కేఎల్లార్,  మేయర్ పారిజాత, నాయకులు పాల్గొన్నారు.