calender_icon.png 16 November, 2025 | 5:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముసాయిదా బడ్జెట్‌పై సభ్యుల అసహనం

01-12-2024 02:35:54 AM

  1. ఆదాయానికి సరిపడా కేటాయింపులు లేవని పెదవి విరుపు
  2. స్టడీ చేసేందుకు సరిపడా సమయంల ఇవ్వలేదని ఆగ్రహం
  3. వచ్చే వారానికి వాయిదా వేసిన మేయర్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 30 (విజయక్రాంతి): 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బల్దియా రూపొందిం చిన ముసాయిదా బడ్జెట్ పలు విమర్శలకు దారితీస్తోంది. ఆదాయానికి సరిపడా కేటాయింపులు లేవని, ముసాయిదా కాపీ సకాలంలో అందజేయకపోవడంతో బడ్జెట్ కాపీ స్టడీ చేయలేదంటూ స్టాండింగ్ కమిటీ సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. జీహెచ్‌ఎంసీ ఆదాయానికి తగ్గట్టుగా కేటాయింపు లు చేయకపోవడంపై అధికారుల తీరుపై స్టాండింగ్ కమిటీ సభ్యులు అసహనం వ్యక్తం చేసినట్టుగా సమాచారం.

జీహెచ్‌ఎంసీ 2025 ఏడాదికి రూపొందించిన రూ.8,340 కోట్ల ముసాయిదా బడ్జెట్‌తో పాటు ప్రస్తుత 2024 ఏడాదికి సంబంధించిన రూ. 7,337 కోట్ల రివైజ్డ్ బడ్జెట్‌ను ఆమోదించేందుకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన శనివారం స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కమిషనర్ ఇలంబర్తితో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, సమావేశం జరుగుతుండగా నగర అభివృద్ధిని పాలకవర్గం నిర్లక్ష్యం చేస్తుందని బీజేపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. 

తగ్గిన కేటాయింపులు.. 

రానున్న ఆర్థిక సంవత్సరానికి జీహెచ్‌ఎంసీ రూ. 8,340 కోట్లకు ముసాయిదా బడ్జెట్‌ను రూపొందించుకుంది. ఈ బడ్జెట్ బల్దియా ఆదాయానికి తగ్గట్టుగా లేదనే విమర్శలు వస్తున్నాయి. 2023 ఏడాదికి రూ.1924 కోట్లు ప్రాపర్టీ టాక్స్ వసూలు కాగా, 2024 ఏడాదికి రూ.1,907 కోట్లు టాక్స్ వసూలు అవుతుందని అంచనా వేశారు. ఇది గతేదాది వసూలైన దాని కంటే రూ. 17 కోట్లను రూపొందించడం గమనార్హం.

ప్రాపర్టీ పెంచుకోవడంలో భాగంగా దాదాపు రూ. 22 కోట్ల వ్యయంతో చేపడుతున్న జీఐఎస్ సర్వే ఫలితాలు రానట్టుగానే స్పష్టమవుతుంది. సొంత ఆస్తుల విభాగం ఎస్టేట్ లో రెండేళ్లుగా ఆదాయం పడిపోతుంది. ట్రేడ్ లైసెన్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని జీహెచ్‌ఎంసీ పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుందనే విమర్శలు ఉన్నాయి. 2023 89 కోట్లు వసూలు కాగా, 2024 రూ. 110 కోట్లు వసూలవుతుందని ప్రతిపాదనలు చేశారు. వచ్చే ఆర్థిక ఏడాది 2025 రూ.92 కోట్లు మాత్రమే అంచనా వేశారు. అడ్వర్‌టైజ్‌మెంట్ విభాగానికి సంబంధించిన ఆదా యం ఏడాదికి ఏడాది క్రమేపీ తగ్గిపోతుంది. 

ఆదాయం పెంచేలా బడ్జెట్ ఉండాలి: మేయర్ 

2025- 26 ఆర్థిక సంవత్సరానికి జీహెఎంసీ బడ్జెట్ ప్రతిపాదనలలో వృథా ఖర్చులను తగ్గించి, ఆదాయం పెంచేలా బడ్జెట్ రూపొందించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి స్టాండింగ్ కమిటీ సమావేశంలో అధికారులను ఆదేశించారు. బడ్జెట్ ప్రతిపాదనల ఆమోదం వచ్చే వారానికి వాయిదా వేసినట్టు ఆమె తెలిపారు.

బడ్జెట్ ముసాయిదా ప్రతిపాదనలు అధికారులు సకాలం లో అందించకపోవడం కారణంగా సభ్యులు ముసాయిదా బడ్జెట్ ను స్టడీ చేయలేకపోవడంతో పాటు బడ్జెట్ ప్రతిపాదనలు రియలిస్టిక్‌గా లేదనే అభిప్రాయానికి స్టాం డింగ్ కమిటీ సభ్యులు రావడంతో వచ్చే వారానికి వాయిదా వేసినట్టు తెలిపారు. దీంతో ము సాయిదా మార్పులు, చేర్పులతో డిసెంబరు 9 తర్వాత మరోసారి చర్చించనున్నారు.