calender_icon.png 24 October, 2025 | 8:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేనేత ఎక్స్‌లెన్స్ సెంటర్ నిర్మాణ పనులు పూర్తి చేయాలి

24-10-2025 12:01:29 AM

నారాయణపేట.అక్టోబర్,23(విజయక్రాంతి): నవంబర్ నెలాఖరు నాటికి చేనేత ఎక్స్ లెన్స్ సెంటర్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లా కేంద్రానికి సమీపంలోని సింగారం మలుపు దారి వద్ద గల వృత్తి నైపుణ్య అభివృద్ధి కేంద్రం పక్కన కొనసాగుతున్న  చేనేత ఎక్స్ లెన్స్ సెంటర్ నిర్మాణ పనులను గురువారం ఆమె స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ తో కలిసి పరిశీలించారు.

డోర్స్, లైటింగ్, టాయిలెట్ బ్లాక్, సెంటర్ చుట్టూ ప్రహరీ పనులను చూసి మిగిలిన పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. సెంటర్ నమూనా మ్యాప్ ను చూశారు. నవంబర్ నెల చివరి వరకు నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. టెస్కో ఓ ఎస్ డీ హైదరాబాద్ రతన్ కుమార్,, మహబూబ్ నగర్ చేనేత జౌళి శాఖ ఏడి తో సెంటర్ పురోగతి పై చర్చించారు. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే నెలాఖరునాటికి  భవన నిర్మాణ పనులు పూర్తి కావాలని ఆమె తేల్చి చెప్పారు. కార్యక్రమంలో టి జి ఎం ఎస్ ఐ డి సి ఈఈ రవీందర్,ఏ ఈ సాయి మురారి, నారాయణ పేట చేనేత జౌళి శాఖ ఏడి బాబు, ఆర్కిటెక్చర్ ఇస్మాయిల్‌పాల్గొన్నారు.