calender_icon.png 24 October, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేషన్ బియ్యం అక్రమ రవాణ అరికట్టాలి

24-10-2025 12:00:00 AM

కలెక్టర్ పి.ప్రావీణ్య 

సంగారెడ్డి, అక్టోబర్ 23 (విజయక్రాంతి): జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అరికట్టాలని, విజిలెన్స్ బలోపేతం, ఆధారాల సేకరణపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై పౌరసరఫరాల శాఖ నమోదు చేసిన 6-ఏ కేసుల పురోగతిపై    అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేసుల పరిశీలనలో వేగం తీసుకురావాలని, రేషన్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వారిపై పటిష్ట చర్యలు తీసుకోవాలని సూచించారు.  బియ్యం అక్రమ రవాణా వాహనాలను పట్టుకున్నప్పుడు పోలీసు, రెవెన్యూ అధికారులు తప్పనిసరిగా వీడియో, ఫోటో ఆధారాలను సేకరించి, 6-ఏ నివేదికకు జతపరిచి సమర్పించాలన్నారు.

జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, నిల్వలపై కఠిన చర్యలు కొనసాగుతాయని, అందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మాధురి, డిఎం సివిల్ సప్లై అంబదాస్ రాజేశ్వర్, కమర్షియల్ టాక్స్ అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు.