24-10-2025 12:03:04 AM
రామచంద్రాపురం, అక్టోబర్ 23 : రామచంద్రాపురం డివిజన్లోని శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ ఆవరణలో యాదవుల సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని నూతన సదర్ కమిటీ అధ్యక్షులు రాగం రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన రామచంద్రపురం కార్పొరేటర్, జిహెచ్‌ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు బూరుగడ్డ పుష్పనగేష్ యాదవ్ పూజా కార్యక్రమాలు నిర్వహించి సదర్ సమ్మేళనాన్ని ప్రారంభించారు. తదనంతరం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సదర్ ఉత్సవాల్లో పాల్గొని, పోతులను తెచ్చిన యాదవులకు సన్మానాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, నాయకులుపాల్గొన్నారు.