22-11-2025 12:00:00 AM
సీఐ పవన్ కుమార్ రెడ్డి
మొయినాబాద్, నవంబర్ 21 (విజయక్రాంతి): భవన నిర్మాణ కార్మికులం తా ఐకమత్యంగా కలిసి పని చేసుకోవాలని మొయినాబాద్ సిఐ పవన్ కుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం మొయినాబాద్ మండలంలోని భవన నిర్మాణ సెంట్రింగ్ యూనియన్ కార్మికులు యూనియన్ అధ్యక్షుడు బుర్ర శంకరయ్య ఆధ్వర్యంలో సిఐ పవన్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కార్మికులందరూ ఐక్యంగా ఉండాలని సూచించారు.
చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి మార్గంలో నడవాలని తెలిపారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ఏమైనా సమస్యలు ఉంటే యూనియన్ ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షులు బుర్ర శంకరయ్య, ప్రధాన కార్యదర్శి రవి సాగర్ లు పాల్గొన్నారు.