22-11-2025 12:00:00 AM
- గాడి తప్పుతున్న చదువు
కరీంనగర్, నవంబరు 21 (విజయ క్రాంతి): కరీంనగర్ జిల్లాలో పాఠశాలలు మ దుశాలలుగా మారుతున్నాయి. విద్యాబుద్దు లు నేర్పవలసిన పంతుళ్ళు పాఠశాలకు మ ద్యం సేవించి వస్తున్నారు. పాఠశాల ఉపాధ్యాయులు, వ్యాయామ ఉపాధ్యాయుల నుండి అటెండర్ల వరకు ఇటివల మద్యం సే వించి వస్తున్న సంఘటనలు ఆందోళన కలిగిస్తున్న విషయం. గంగాధర మండలం సం ఘటన మరొక ముందే మరో సంఘటన ఇదే మండలంలో చోటు చేసుకోవడం,తా జాగా హుజురాబాద్ డివిజన్ లోముగ్గురు ఉపాధ్యాయులు సస్పెండ్ కు గురికావడం పంతుళ్ల పనితీరును తెలుపుతుంది.
ఒకపక్క కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి బు ధవారం బోధన పేరుతో ప్రతి ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తూ విద్యార్థుల్లో నైపుణ్యత పెంచే విధంగా కృషి చేస్తుంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు కొందరు.ఇందుకు భిన్నంగా వ్య వరిస్తుండడం ఆందోళన కలిగిస్తున్న విష యం. హుజరాబాద్ డివిజన్లో చోటు చేసుకున్న సంఘటన ఉపాధ్యాయ వృత్తికే కళం కం తెచ్చే విధంగా ఉంది. తాజాగా కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ముగ్గురు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తూ డీఈవో ఉత్తర్వులు జారీ చేశారు.
హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేసే ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయుడు ప్రవీణ్ కుమార్, ఇదే పాఠశాలలో ఫిజికల్ సైన్స్ బోధించే సమ్మయ్యతో పాటు హుజురాబాద్ మండలం చెల్పూర్ పాఠశాలలో ఫిజికల్ సైన్స్ టీచర్ గా పనిచేసే ఐలయ్యలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ప్రవీణ్ కుమార్, సమ్మయ్య మద్యం సేవించి పాఠశాలకు హాజరైనట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఐలయ్య అనే టీచర్ విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం, ఉన్నతాధికారుల ఆదేశాలను పట్టించుకోకపోవడం, పాఠశాల కార్యక్రమాలలో సహకరించకపోవడం, విద్యార్థులను డిస్కరేజ్ చేయడం వంటి చర్యలకు పాల్పడుతు న్నట్లు డీఈవో ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. . ఈ ముగ్గురు ఉపాధ్యాయులు తమ ప్రవర్తన మార్చుకోకుండా పదే పదే ఇవే చర్యలకు పాల్పడటంతో కలెక్టర్ ఆదేశాలతో సస్పెండ్ చేసినట్లు డిఇఓ వెల్లడించారు.
మాయని మచ్చ..
ఇటివల జరిగిన సంఘటన మాయని మచ్చలా నిలిచింది. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటకు చెందిన ఎండీ యాకూబ్ పాషా (30) జిల్లాలోని గం గాధర మండలంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మూడేళ్లుగా అటెండర్గా పనిచేస్తున్నా డు. అతను విద్యార్థులలో పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఫోటోలు మార్ఫింగ్ చేసి ఆ విద్యార్థులకు చూపిస్తూ బెదిరించడమే కాకుండా వేధింపులకు దిగాడు. కొం దరు విద్యార్థినులపై లైంగిక దాడులకు పాల్పడ్డాడు. దాంతో బాధిత విద్యార్థినులు ఆ అటెండ్ప గతంలోనే ఫిర్యాదు చేసినా.. ప్రధానో పాధ్యాయురాలు పట్టించుకోలేదు. అటెండర్ యాకూబ్ ఏడాది కాలంగా తమను లైంగికంగా వేధిస్తున్నాడని, హెచ్‌ఎంకు చెప్పుకొన్నా పట్టించుకోవడం లేదని మొరపెట్టుకున్నారు.
అధికారులు ఈ విషయాన్ని కలెక్టర్ పమేలా సత్పతి దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ హెచ్‌ఎం కమలను సస్పెండ్ చేశారు. పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్న మరో పది మంది ఉపాధ్యాయులకు షోకాజ్లు జారీ చేస్తూ మూకుమ్మడి బదిలీ చేశారు. పోలీసులు అటెండర్ యాకూబ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అతనిపై బీఎన్‌ఎస్, పోక్సో, ఐటీ చట్టాల్లోని కఠిన మైన సెక్షన్లలో కేసునమోదుచేశారు.