22-11-2025 12:00:00 AM
నాలుగెకరాల ప్రభుత్వ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేసిన హైడ్రా
శేరిలింగంపల్లి, నవంబర్ 21 (విజయక్రాంతి): శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్‌లో బడాబాబుల ఆగడాలకు ఎట్టకేలకు హైడ్రా చెక్ పెట్టింది. ఈ ప్రాంతంలో ఎకరం సుమారు రూ.200 కోట్లు వరకూ ధర పలుకుతోంది. ఇలా కాపాడిన భూమి విలువ దాదాపు రూ.700ల కోట్ల వరకు ఉంటుందని తెలిపారు. కొండాపూర్ విలేజ్లో 57.20 ఎకరాల విస్తీర్ణంలో 627 ప్లాట్లతో శ్రీ వేంకటేశ్వర హెచ్ ఏ ఎల్ కాలనీని 1980 దశకంలో ఏర్పాటు చేశారు.
ఎకరాల చొప్పున 2 పార్కులు, 2 ఎకరాల పరిధిలో మరో పార్కుతో పాటు,1000 గజాల మేర ప్రజావసరాలకు స్థలాలను కేటాయించారు. ఇప్పుడవి ఆక్రమణలకు గురయ్యాయి. పార్కులను బైనంబర్ల ద్వారా ప్లాట్లుగా మార్చేసి అమ్మినట్లు పేర్కొన్నారు. ఇదే విషయమై దశాబ్దాలుగా పోరా డుతున్న శ్రీ వేంకటేశ్వర హెచ్‌ఏఎల్ రెసిడెంట్స్ వెల్ఫే ర్ అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రాను ఆశ్రయించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం ప్రజావాణి ఫిర్యాదును హైడ్రా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
పార్కులు ప్లా ట్లుగా మారినట్టు హైడ్రా అధికారులు గుర్తించారు. అబ్బినేని అనసూయతో పాటు ఇత రుల దగ్గర నుంచి వైబీకే రావు జీపీఏ కుదుర్చుకుని 1980 దశకంలో లే ఔట్ వేశారు.ఆ లేఔట్ ప్రకారం ప్లాట్లు కొన్నవారు ఆయా ప్లాట్లను, నిర్మించిన భవనాలను ఎల్ ఆర్ ఎస్, బీఆర్ ఎస్ ద్వరా రెగ్యులరైజ్ కూడా చేసుకున్నారు. 1.20 ఎకరాల మేర ఉండాల్సిన పార్కును 3 భాగాలుగా విడదీసి 11 ప్లాట్లు చేసి అమ్మేసినట్టు నిర్ధారణ అయ్యింది.
వీళ్ల దగ్గర నుంచి సింహా డెవలపర్స్, వాసవి నిర్మాణ సంస్థతో పాటు మరో ఇద్ద రు ముగ్గురు కొని బౌన్సర్లను పెట్టారు. రెసిడెంట్స్ వెల్ఫేర్ ఆసోసియేషన్ ప్రతినిధులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. పార్కులతో పాటు ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడాలని హైకోర్టు కూడా సూ చించింది. హైడ్రాను ఈ దిశగా మార్గదర్శ నం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం పార్కుల చుట్టూ ఫెన్సింగ్ వేసి, బోర్డు లను హైడ్రా బోర్డును ఏర్పాటు చేశారు.