calender_icon.png 22 November, 2025 | 12:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్ణాటక సరిహద్దులో అయ్యప్ప భక్తుల సందడి

22-11-2025 12:00:00 AM

శభరి గిరీశ మహా పాదయాత్ర సేవా సమితి ఆధ్వర్యంలో పూజ

సనత్‌గర్, నవంబర్ 21 (విజయక్రాంతి): శబరిమల యాత్ర సీజన్ ప్రారంభ దశలోనే భక్తి తరంగాలు ఉద్ధృతంగా వెల్లివిరుస్తున్నా యి. హైదరాబాద్ నుంచి గత 21 రోజులుగా పాదయాత్ర కొనసాగిస్తున్న అయ్యప్ప స్వాములు ఈరోజు శ్రీ శభరి గిరీశ మహా పాదయాత్ర సేవా సమితి ఆధ్వర్యంలో కర్ణాటక తమిళనాడు సరిహద్దు వద్ద ఘన పూజ లు నిర్వహించారు. హైదరాబాద్ బేగంపేట నుండి ప్రారంభమైన ఈ పాదయాత్ర ఇప్పటివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మూడు రాష్ట్రాల సరిహద్దులను దాటి, ఈ రోజు తమిళనాడులోకి విజయవంతంగా ప్రవేశించింది.

దీర్ఘ ప్రయాణం చేసినా స్వాములలో కనిపించిన భక్తి నిబద్ధత, క్రమశిక్షణ, యాత్రాస్ఫూర్తి అందర్నీ ఆకట్టుకుంది. ఉదయం బ్రహ్మముహూర్తం నుంచే స్వాము లు సమష్టిగా చేరి పూజలు నిర్వహించారు. పాదయాత్రలో ఉన్న స్వాముల ఆరోగ్యం, క్షేమం, శబరిమల దర్సన యాత్ర విజయవం తం కోసం ప్రత్యేక ప్రార్థనలు అర్పించారు. స్వామియే శరణం అయ్యప్ప నినాదాలతో ప్రాంతమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది.

ఈ కార్యక్ర మంలో సోములు యాదవ్ గురుస్వామి, బుచిబాబు గురుస్వామి, బాలూ యాదవ్ గురుస్వామి, నాగ రాజు గురుస్వామి, బాబులు గౌడ్ గురుస్వామి, పవన్ స్వామి, టి.నాగరాజు ముది రాజ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.నవంబర్ 1న బేగంపేట్ హనుమాన్ మందిరం నుంచి ప్రారంభమైన ఈ 21 రోజుల పాదయాత్ర, అయ్యప్ప భక్తుల ఐక్యత, సేవాభా వం, ఆధ్యాత్మిక శ్రద్ధలకు ప్రతీకగా నిలిచింది.