calender_icon.png 22 November, 2025 | 12:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క్రాంతి విద్యాలయం చిన్నారి అరుదైన రికార్డు

21-11-2025 11:59:17 PM

నాలుగేళ్ల వయసులో భగవద్గీత అధ్యాయాలలో దిట్ట

విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారికి సిఫార్సు

భద్రాచలం(విజయక్రాంతి): భద్రాచలంలోని ప్రముఖ విద్య సంస్థ క్రాంతి విద్యాలయం చెందిన ఎల్కేజీ చదువుతున్న వరద శ్రీ ఎన్వీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. నాలుగు సంవత్సరాలు వయసులోనే భగవద్గీతలోని రెండు అధ్యాయాలను అవలీలగా వల్లిస్తూ విశ్వగురు వరల్డ్ రికార్డ్స్ వారి దృష్టిలో పడింది. ఈ క్రమంలో ఈ చిన్నారికి జిల్లాలోని అత్యుత్తమ ప్రదర్శన ప్రదర్శించినందుకు అవార్డును హైదరాబాదులో అందించనున్నారు.

ఇదే క్రమంలో ఈ వయసు వారు ఎన్ని అధ్యాయాలను చెప్పారనే విషయంపై ప్రపంచ రికార్డ్ అందించే సంస్థలకు విశ్వ గురు వారు పరిశీలనకు పంపించడం జరిగింది. స్థానికంగా స్టేషనరీ షాపును నిర్వహిస్తున్న సతీష్ లక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద పాప శ్రీనిధి చిన్న వయసు నుంచి భగవద్గీతలో పట్టు సాధించింది. ప్రస్తుతం 8 అధ్యాయాలు వరకు అవలీలగా వల్లిస్తుంది. ఈ క్రమంలో శ్రీనిధికి కూడా ఎన్నో అవార్డులు రివార్డులు దక్కాయి. మరోవైపు ఆమె చెల్లి ఎన్వి 4 సంవత్సరాలకి భగవద్గీతపై పట్టు సాధించి భగవద్గీత గొప్పదనాన్ని పదిమందికి తెలిపే ప్రయత్నంలో తన అక్కతో పాటు తన వంతు కృషి నిర్వహించటం అభినందనీయం.

ఎన్వీ కృషిని ప్రపంచ రికార్డుల నమోదు చేసే సంస్థలు గుర్తించాలని భావిస్తున్నట్లు క్రాంతి విద్యాలయం కరస్పాండెంట్ సమత తెలిపారు. వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేస్తూ ప్రతి విద్యార్థిలో ప్రత్యేకమైన స్కిల్స్ ఉంటాయని అన్నారు. వాటిని గుర్తించి అభివృద్ధి చెందేందుకు తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాలతో కలిసి పని చేయాలని కోరారు.