3 July, 2026 | 1:06 AM

బస్సును ఢీకొన్న కంటైనర్.. తప్పిన ప్రమాదం

03-07-2026 12:00 AM

రాజాపూర్ జూన్ 2 : మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి గ్రామ శివారులోని జాతీయ రహదారిపై బస్సును కంటైనర్ ఢీకొన్న సంఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జడ్చర్ల వైపు నుండి హైదరాబాద్ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనక నుండి వస్తున్న కంటైనర్ వెనక భాగంలో ఢీ కొట్టింది.

ఈ ప్రమాద ఘటన బస్సులో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పిలుచుకున్నారు. ఈ ప్రమాద సంఘటనతో జాతీయ రహదారిపై వాహనాలు కిలోమీటర్ మేర నిలిచిపోయాయి. ప్రమాద సంఘటన తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్ ని క్లియర్ చేశారు.