హైటెక్స్‌లో ప్రారంభమైన ఫుడ్ ఏ ఫెయిర్
మూడు రోజుల ట్రేడ్ ఫెయిర్‌ను ప్రారంభించిన పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్
శేరిలింగంపల్లి, జూలై 2 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ ఆహార, పానీయాలు, అనుబంధ పరిశ్రమల వాణి జ్య ప్రదర్శన ‘ఫుడ్ ఎ ఫెయిర్2026’ మూ డో ఎడిషన్ హైదరాబాద్లోని మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ నెం.1,3లో గురువారం ప్రారంభమైంది. ఈ మూడు రోజుల పాటు జరిగే ఈ ట్రేడ్ ఫెయిర్ను భా రత బ్యాడ్మింటన్ జాతీయ ప్రధాన కోచ్, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గోపీచంద్ మీడియా తో మాట్లాడుతూ, పోషకాహారం మరియు భారతీయ సాంప్రదాయ ఆహార విధానాల ప్రాధాన్యాన్ని వివరించారు.
నా జీవితంలో ఇంతమంది చెఫ్లను ఒకే వేదికపై చూడటం ఇదే మొదటిసారి. చెఫ్లు సాధారణంగా తెరవెనుక ఉండి మనకు రుచికరమైన, పోషకా హారాన్ని అందిస్తారు. వారంతా ఈరోజు అందరి ముందుకు రావడం ఆనందంగా ఉందని అన్నారు. ఐసీఎంఆర్ మిల్లెట్ల ప్రాధాన్యాన్ని ప్రస్తావించడం సంతోషంగా ఉందని, ప్రస్తుత జీవనశైలిలో పెరుగుతున్న సెడెంటరీ లైఫ్స్టైల్ వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ఈ ఏడాది ఫుడ్ ఎ ఫెయిర్లో ‘కలినరీ కార్నర్’ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెఫ్ అసోసియేషన్ల భాగస్వామ్యంతో ప్రముఖ చెఫ్లు లైవ్ వంట ప్రదర్శన లు, ప్రత్యేక రుచుల పరిచయం, ఫుడ్ పోటీ లు, సెమినార్లు నిర్వహిస్తారు. రిటైలర్లు, హో ల్సేలర్లు, తయారీదారులు, ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు, స్టార్టప్లు, చెఫ్లు ఒకే వేదికపైకి వచ్చే లా ఈ ప్రదర్శన ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. బిజినెస్-టు-బిజినెస్ స మావేశాలు, కొత్త ఉత్పత్తుల ఆవిష్కరణలు, పరిశ్రమ నిపుణులతో చర్చలు జరుగుతాయన్నారు.
ఈ ప్రదర్శన జూలై 4 వరకు కొన సాగుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు.బ్లిట్జ్ ఎగ్జిబిషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఫెయిర్కు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ,చెఫ్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్ర, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్, న్యూట్రిహబ్, హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ సహకరిస్తున్నాయి. వేడుకలో ఏఎల్‌ఈఏపీ వ్యవస్థాపక అధ్యక్షురాలు రామాదేవి, ఐసీఏఆర్, ఐఐఎంఆర్ శాస్త్రవేత్త డా.జె.స్టాన్లీ, న్యూట్రి హబ్ సీఈ ఓ డా. స్టాన్లీ, సెలబ్రిటీ చెఫ్ సంజయ్ తు మ్మ, చెఫ్ శీతారామ్ ప్రసాద్ పాల్గొన్నారు.






