29-11-2025 12:51:20 AM
ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సదానందంగౌడ్, గజేందర్ వెల్లడి
నిర్మల్, నవంబర్ 2౮ (విజయక్రాంతి): ఉపాధ్యాయ విద్యాలయ సమస్యలపై ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలు అమలు అయ్యేవరకు ఎస్టీయూ టీఎస్ పోరా టం చేస్తుందని ఇప్పుడు జిల్లా ఉపాధ్యక్షులు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సదానందంగౌడ్, గజేందర్ ఉన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జుట్టు గజేంద్ర ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై నిర్మల్ వచ్చిన సందర్భంగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
ఎన్నికైన తర్వాత శుక్రవారం జిల్లాకు తొలి సారిగా విచ్చేసిన సందర్భంగా స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పెన్షనర్ల సంఘ భవనంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడి పీఆర్సీపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇప్పటికే నాలుగు రాష్ట్రాలు సిపిఎస్ నుపూర్తిగా రద్దు చేశాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిం చాలని డిమాండ్ చేశారు. పెన్షనర్ల సంఘ జాతీయ ప్రధాన కార్యదర్శి యం. సి. లింగన్న మాట్లాడుతూ.. నిర్మల్ జిల్లా వాసి జుట్టు గజేందర్ ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గుర్తింపు పొందడం హర్షణీయం అని, వారి సేవలను కొనియాడారు.
ఈ సమావేశంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్. భూమన్న యాదవ్ , జె. లక్ష్మణ్, రాష్ట్ర నాయకులు నాగభూషణ్, గోవింద్ నాయక్, బాజా రెడ్డి, ఇర్ఫాన్ శేఖ్, పల్సీకర్ శ్రీనివాస్, వెంకటేశ్వర్ రావు, వివిధ ఉపాధ్యాయ, ఉద్యోగ సం ఘ నాయకులు వి. ప్రభాకర్, రవి కుమార్, టి. నరేంద్ర బాబు, బి. రమణారావు, దాసరి శంక ర్, అశోక్, రవికాంత్, వాహిద్ ఖాన్, విజయ్ కుమార్, రాజేశ్ నాయక్ పాల్గొన్నారు.