calender_icon.png 29 November, 2025 | 2:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంచాయతీ ఎన్నికల్లో ఫ్రీ సింబల్స్

29-11-2025 12:50:33 AM

ప్రకటించిన ఎన్నికల సంఘం

హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాంతి) : తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఫ్రీ సింబల్స్‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల గుర్తులను విడుదల చేసింది. బ్యాలెట్ చివరి గుర్తు తర్వాత నోటా గుర్తు ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు ఈసీ నోటిఫికేషన్ పంపింది. మొదటి విడత జరిగే గ్రామ పంచాయతీల్లో వార్డు, సర్పంచ్ ఎన్నికల కోసం అధికారులు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో గ్రామాల్లో ప్రధాన పార్టీల నేతలతో పాటు స్వతంత్రులు కూడా పోటీకి సిద్ధమవుతున్నారు. గ్రామ స్థాయిలోనే తమ అనుచరులతో చర్చలు జరుపుతూ చివరి రోజునే పూర్తిస్థాయిలో నామినేషన్లను దాఖ లు చేసేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు. మొదటి విడత ఎన్నికల నామినేష న్‌కు శనివారం చివరి రోజు కావడంతో  అధికారులు భారీ ఏర్పాట్లను చేస్తున్నారు.