29-11-2025 12:52:44 AM
తెలంగాణకు మోదీ చేసిందేమిటో చర్చకు సిద్ధమా?
బీజేపీ నేత లక్ష్మణ్ వ్యాఖ్యలపై పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆగ్రహం
హైదరాబాద్, నవంబర్ 28 (విజయక్రాం తి) : గాంధీ కుటుంబంపై బీజేపీ నేత లక్ష్మణ్ విమర్శలు చేయడం సరికాదని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హితవు పలికారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు.. అప్పటికి బీజేపీ నేత లక్ష్మణ్ పుట్టలేదు. అలాంటి వ్యక్తి రాహుల్‌గాంధీ కటుంబంపై విమర్శలు చేయడం ఏంటని జగ్గారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన గాంధీభ వన్‌లో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేశం అన్నింటా అభివృద్ధి పథంలోకి దూసుకెళ్లిందని.. రాజీవ్‌గాంధీ ప్రధా ని అయ్యాక టెక్నాల జీలోనూ ఎంతో డెవలప్‌మెంట్ వచ్చిందని.. ఇంత అభివృద్ధి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉందా..? అని ప్రశ్నించారు. ఎంతో చరిత్ర కలిగిన కుటుంబానికి మూడు ఎంపీ పదవులు ఎందుకు..? అని లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలు చేయడం ఆయన అమాయకత్వానికి నిదర్శనమని జగ్గారెడ్డి విమర్శించారు.
సోనియాగాంధీ, రాహుల్‌గాంధీకి ప్రధాని అయ్యే అవ కాశం రెండుసార్లు వచ్చినా మన్మోహన్‌సింగ్‌ను ప్రధాని చేశారని గుర్తుచేశారు. బీజేపీలో ఎవరైనా త్యాగం చేశారా..? గాంధీ కుటుంబానిది త్యాగాల కుటుంబమని తెలిపారు. మోదీ ప్రధాని అయ్యి 12 ఏండ్లు అయ్యిం ది.. ఏదైనా పెద్ద కంపెనీ తెచ్చాడా..? తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏమిటో చర్చకు సిద్ధ మా..? అని సవాల్ చేశారు.
దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా.. బీజేపీ దొంగ ఓట్లతో గెలుస్తూ వస్తోందని జగ్గారెడ్డి ఆరోపించారు. సంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో మంత్రి దామోదర రాజనరసింహ చేసిందే ఫైనలని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తోందని, హామీలను అమలు చేస్తోందన్నారు.