04-05-2025 12:50:28 AM
అబిడ్స్‌లో కేసు నమోదు
హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారిపై శనివారం బీజేపీ కార్పొరేటర్ రాకేశ్ జైస్వాల్ దాడి చేయడంతో ఆయనపై అబిడ్స్ పోలీ స్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించి, దాడికి పాల్పడ్డారని కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై జీహెచ్‌ఎంసీ కమిషన ర్ కర్జన్ స్పందించారు. అధికారులపై దాడులు చేస్తే సహించబోమని హెచ్చరించారు.