calender_icon.png 7 May, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిస్ వరల్డ్-- ఏర్పాట్లపై సమీక్ష

04-05-2025 12:49:09 AM

అధికారులతో సీఎస్ రామకృష్ణారావు టెలికాన్ఫరెన్స్

హైదరాబాద్, మే 3 (విజయక్రాంతి): ఈ నెల 10 నుంచి హైదరాబాద్‌లో జరుగనున్న మిస్ వరల్డ్ సంబంధించిన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామ కృష్ణారావు సీనియర్ పోలీసు అధికారులు, ఇతర శాఖల ఉన్నాతాధికారులతో శనివారం తెలంగాణ సచివాలయంలో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

సీఎం సూచన మేరకు  మిస్ వరల్డ్ ఈవెంట్‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విస్తృత స్థాయి ఏరాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచ నలుమూలల నుం చి అతిథులు రానున్న వేళ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు శాఖను ఆదేశించారు.

ఎయిర్‌పోర్టు, హోటల్స్, అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించే వేదికల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలన్నారు. పోటీదారుల కోసం సవివరమైన బుక్‌లెట్‌లు  సిద్దం చేయాలని పర్యాటక శా ఖ అధికారులను ఆదేశించారు. సమావేశం లో డీజీపీ జితేందర్, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి క్రిస్టీనా చోంగ్తూ, సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ వినయ్ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

హైదరాబాద్ చేరుకున్న మిస్ కెనడా 

మిస్ వరల్డ్ పోటీలు జరగనున్న నేపథ్యం లో వివిధ దేశాల సుందరీమణుల రాక ప్రారంభమైంది. మిస్ కెనడా ఎమ్మాడీనా కాథరిన్ శనివారం శంషాబాద్ ఏయిర్‌పోర్టుకు చేరుకో గా.. అధికారులు ఆమెకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలతో ఘన స్వాగతం పలికారు.