calender_icon.png 7 May, 2025 | 5:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ ఫ్యామిలీ అమెరికా టూర్!

07-05-2025 12:06:10 AM

  1. పార్టీ రజతోత్సవానికి హాజరుకానున్న కేటీఆర్
  2. కొడుకు గ్రాడ్యుయేషన్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న కవిత
  3. మనువడు హిమాన్షును కలిసేందుకు కేసీఆర్ దంపతుల ప్రయాణం!

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అగ్రనేతలు యాదృచ్చికంగా రోజు ల వ్యవధిలోనే అమెరికా పర్యటనకు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలు ఆ పార్టీ ఎన్నారై విభాగం వివిధ దేశాల్లో నిర్వహించనుంది. దీనిలో భాగంగా వచ్చేనెల 1న అమెరికాలోని డల్లాస్‌లో జరిగే రజతోత్సవ సభకు కేటీఆర్ హాజరుకానున్నారు. ఈ నెల 20 తర్వాత ఆయన యూ ఎస్ ప్రయాణం కానున్ను.

అక్కడే జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ కార్యక్రమాల్లో కూడా  పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక ఎమ్మెల్సీ కవిత తన కుమారుడు ఆదిత్య గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి భర్త అనిల్‌తో కలిసి ఈనెల 16న పయ నం కానున్నారు. కవిత అమెరికా పర్యటనకు ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చింది. ఈనెల 23న కవిత తిరిగి హైదరాబాద్‌కు రానున్నారని పార్టీ వర్గాలు చెప్పాయి.

కేసీఆర్ కూడా అమెరికా వెళ్తున్నారని మీడియా సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తు న్నాయి. అమెరికాలో చదువుతున్న తన మనమడు హిమాన్షును చూసేందుకు కేసీఆర్ దంపతులు వెళ్తున్నట్టుగా ప్రచారం జరు గుతోంది. దీనిలో భాగంగానే ఇటీవల ఆయ న హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్‌కు వెళ్లినట్టు సమాచారం.

అమెరికాలో ఆయన నెలన్నర వరకు ఉంటారని, అక్కడు న్న ఎన్నారైలతోనూ భేటీ అవుతారన్న ప్రచా రం జరుగుతోంది. అయితే కేసీఆర్ అమెరికా వెళ్తున్నట్టుగా గతంలో ఎన్నోసార్లు వార్తకథనాలు మీడియాలో వచ్చాయి. కానీ, సీఎంగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడూ అమెరికా వెళ్లలేదు. కానీ సింగపూర్, మలేషియా, చైనా దేశాలకు వెళ్లారు. ఇలా రోజుల వ్యవధిలో కారు పార్టీ అగ్రనేతల అమెరికా టూర్ వెళ్తుండటం ఆసక్తి రేపుతోంది.