06-11-2025 01:16:55 AM
డెత్ కు 50 వేలు..పెళ్లికి 10 వేలు..
కరీంనగర్, నవంబరు 5 (విజయ క్రాంతి): ఇక్కడ కార్మికుల, కార్మిక కుటుంబాల రక్తం తాగుతున్నారు. కార్మికుల సంక్షే మం కోసం పని చేయవలసిన కార్మిక శాఖ లో దళారులు, అధికారిలు కలసి దోచుకుంటున్నారు. క్లెయిమ్ లు దళారులు, అవినీతి అధికారుల పాలిట వరంగా మారుతున్నా యి. కరీంనగర్ ప్రాంతీయ అధికారి కార్యాలయంతో పాటు హుజురాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, మంథని సహాయ కార్మి క అధికారి కార్యాలయంలో అవినీతి జలగలు పెరిగిపోయాయి.
ఇక్కడ పైసలు ఇస్తేనే ఫైల్ కదులు తుంది. డెత్ క్లెయిమ్ కు 50 వే లు, కార్మికుల పిల్లల వివాహానికి 10 వేలు ముందు ఇస్తేనే ఫైలు కదిలి కార్మికుల ఖాతా లో జమవుతాయి. కార్మిక కార్డుల నమోదు నుంచి వివాహ కానుకలు, జనన, మరణ క్లెయిమ్ ల వరకు ప్రతి దరఖాస్తుకు అన్నిటికీ ఇక్కడ లంచాలు సమర్పించుకోవాల్సిందే. వందలాది మంది కార్మికులు తమ లేబర్ క్లెయిమ్ ల కోసం మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న తర్వాత, ఫిజికల్ ఫైళ్లను సమర్పించడానికి కార్యాలయానికి వస్తుంటారు.
అయితే, ఈ కార్యాలయంలో బ్రోకర్ల వ్యవస్థను ఏర్పాటు చేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. కొన్ని చోట్ల ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను కొందరు అధికారులు బ్రోకర్ గా మార్చారు. కీలకమైన డెత్ క్లెయిమ్ కు అయితే రూ. 30 వేల నుంచి రూ. 50 వేల వరకు బలవంతంగా వసూలు చేస్తున్న ఆరోపణలు ఉన్నాయి. కార్మిక సంఘం ముసుగులో ఉన్న కొందరు బ్రోకర్లు గా మారి వాటా పంచుకుంటున్నా రు. కొన్ని చోట్ల స్థానిక ఏజెంట్లను, బ్రోకర్లను అక్రమంగా నియమించుకున్నారని తెలుస్తోంది.
ఈ బ్రోకర్లు డబ్బులు తీసుకున్న వెం టనే అధికారి దృష్టికి తీసుకెళ్లడం, ఆయన వెంటనే ఆన్లైన్లో ఫైల్ ను ఫార్వర్డ్ చేయడం నిత్యకృత్యంగా మారిందని కార్మికులు చెబుతున్నారు. డబ్బులు ఇవ్వని పక్షంలో దరఖాస్తులను పెండింగ్లో పెట్టి కార్మికులను కార్యాలయం చుట్టూ తిప్పుకోవడం పరిపాటిగా మారడంతో వారు అడిగిన కమీషన్ చెల్లించుకుంటున్నారు.
ఆఫీస్ చుట్టూ తిరగలేక పోతున్నాం
లేబర్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోతున్నమే తప్ప ఇప్పటివరకు పనులు కావడం లేదు బ్రోకర్లు ఇష్టానుసారంగా పైసలు వసూలు చేస్తూ పనులు చేయకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. అధికారులను కలుద్దామంటే ఉండరు. ఏ పనికయిన రేటుకడుతున్నారు.
కొలిపాక వెంకటేష్.హుజురాబాద్