calender_icon.png 6 November, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతులకు ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోళ్లు

06-11-2025 01:15:12 AM

  1. మంథని ఏఎంసి, ఎక్లాస్ పూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం 

మంథని ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న

మంథని, నవంబర్ (విజయ క్రాంతి) రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరి ధాన్యం కొనుగోళ్లు చేపడుతామని మం థని ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న అన్నారు. బుధవారం మంథని ఏఎంసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఎంసి చైర్మ న్ కుడుదుల వెంకన్న సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ తో కలిసి ప్రారంభించారు. అనంతరం సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ ఎక్లాస్ పూర్ సెంటర్ ను ప్రారంభిం చారు.

ఈ సందర్భంగా ఏఎంసి చైర్మన్ కుడుదుల వెంకన్న మాట్లాడుతూ రైతుల ఇ బ్బందులు గ్రహించిన కాంగ్రెస్ ప్రభుత్వం గ తంలోనే వ్యవసాయ మార్కేట్ యార్డును నిర్మించడం జరిగిoదని, దీనిని ఐటి, పరిశ్రమలు, శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సహకారం తో మరిం త అభివృద్ధి చేస్తామని తెలిపారు. సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ మాట్లాడుతూ కొన్ని ప్రత్యేక పరిస్తితుల కారణంగా ఐటి, పరిశ్రమలు,

శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ప్రారంభోత్సవానికి రాలేక పోయారని, వాతావరణ పరి స్థితుల నేపథ్యంలో రైతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఐటి, పరిశ్రమలు, శాస న సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, టిపిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ళ శ్రీను బాబు ఆదేశాల మేరకు ఏఎం సి, ఎక్లాస్ పూర్ వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారoభించుకోవడం జరిగిందని తెలిపారు.

వర్షాలకు ధాన్యం తడిసిన ప్పటికి రైతులు ఏ మాత్రం అధైర్య పడవద్దని, ప్రతీ ధాన్యం గింజను కొనుగోలు చేస్తా మని అన్నారు. హమాలి సమస్య అయినా, ఇతర సమస్య అయినా ఏ సమస్య వచ్చినా సింగిల్ విండో, ఏఎంసి పాలకవర్గం, సంఘ సిబ్బంది నిత్యం రైతులకు అందుబాటులో ఉండి పరిష్కరిస్తామని అన్నారు. ధాన్యం విక్రయించిన వెంటనే రైతులకు చెల్లింపులు జరుపుతామని తెలిపారు.

ఎన్నికలకు ముం దు మానిపేస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు మానిపేస్టో లో పెట్టిన మాదిరిగా కాంగ్రెస్ అధికారం లోకి రావడం తోనే సన్న వడ్ల కు క్వింటాల్ కు రూ.500 బోనస్ చెల్లింపు జరిగిందని తెలిపారు. రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి ప్రభుత్వ మద్దతు ధర తో పాటు సన్న వడ్లు క్వింటాల్ కు రూ.500 బోనస్ పొందాలని కోరారు. రైతులు సుభిక్షంగా ఉండాలని తపన పడే నాయకుడు మన శ్రీధర్ బాబు అని అన్నా రు.

ఈ కార్యక్రమం లో సహకార సంఘం ఉపాధ్యక్షుడు బెల్లంకొండ ప్రకాష్ రెడ్డి, డైరెక్టర్లు ఆకుల రాజబాబు, పెద్దిరాజు ప్రభాకర్, రావికంటి సతీష్ కుమార్, లెక్కల కిషన్ రెడ్డి, కొత్త శ్రీనివాస్, దాసరి లక్ష్మి-మొండయ్య, దేవల్ల విజయ్ కుమార్, ఏఎంసి ఉపాధ్యక్షు డు ముస్కుల ప్రశాంత్ రెడ్డి, ఏఎంసి డైరెక్టర్లు అంకుస్, ఓదెలు, ఊదరి శంకర్, జగన్ మోహన్ రావు, మంథని రాజు, నర్సింగరావు, గడ్డం పోచం, రావికంటి వెంకటేష్, టీజీఈఆర్సి సలహాదారు,

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్ కో ఆర్డినేషన్ సభ్యుడు శశిభూషణ్ కాచే, మండల కాంగ్రె స్ పార్టీ అధ్యక్షుడు అయిలి ప్రసాద్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ముస్కుల సురేందర్ రెడ్డి, నాయకులు పేరవేన లింగయ్య, బూడి ద శంకర్, ఆకుల కిరణ్, పెంటరి రాజు, సాదుల శ్రీకాంత్, ఎరుకల ప్రవీణ్, అరెల్లి కిరణ్ గౌడ్, మంథని శ్రీనివాస్, పర్శవేన మోహన్, ఆర్ల నాగరాజు, అక్కపాక సది,

అయిలి శ్రీనివాస్, చొప్పకట్ల హనుమంతు, రాం రాజశేఖర్, సేమంతుల ఓదెలు, దొరగోర్ల శ్రీనివాస్, పెండ్లి ప్రభాకర్ రెడ్డి, పుల్లె రవి, కొండ మహేందర్, బొడ్డు శ్రీనివాస్, పేరవేన రాజేష్, అర్థం సదానందం, నాంపల్లి సతీష్, రాదారపు నితీష్, శైలెందర్, రంజిత్, ఇందారపు సది, మార్కెట్ కమిటి సెక్రటరీ సతీష్, సంఘ కార్యదర్శి మామిడాల అశోక్ కుమార్, పెద్ద సంఖ్య లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.