29-12-2025 05:55:52 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని గాంధీనగర్ గ్రామంలో సంపూర్ణ సురక్ష కేంద్రం ఆధ్వర్యంలో విలేజ్ మెగా హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది. జనరల్ చెకప్ తో పాటు రక్త పరీక్షలు చేయడం జరిగింది. జీబీ, హెచ్ఐవీపై యువకులకు ప్రజలకు అవగాహన కల్పించి, హెచ్ఐవి శాంపిల్స్ టెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 150 పరీక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆమని మెడికల్ ఆఫీసర్ విజయకుమార్, సెక్రెటరీ సంగీత, ఎస్ఎస్కే మేనేజర్ భోజన్న, సొన్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.