29-12-2025 05:51:37 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): మద్నూర్ మండల ప్రజలు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని మండల తహశీల్దార్ ఎండి ముజీబ్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి ఆ నాలుగు శాఖల అధికారులు మాత్రమే హాజరు కావడం కనిపిస్తోంది. మిగతా శాఖల అధికారులు హాజరుకాకపోయినా వారిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వారు తరచూ నిర్లక్ష్యం వహిస్తున్నారని వినికిడి. ఇప్పటికైనా ప్రజవాణికి అధికారులందరూ హాజరై ప్రజల సమస్యలను సకాలంలో పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాణి, ఎంపీఓ వెంకట నరసయ్య, ఐకేపీ ఎపీఎం జగదీష్ కుమార్, ఉపాధి హామీ ప్రోగ్రాం అధికారి పద్మ, ఆరోగ్యశాఖ ఏఎన్ఎం పాల్గొన్నారు.