calender_icon.png 21 October, 2025 | 7:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నకిలీ వేబిల్లులతో ఇసుక అక్రమ రవాణా.. ఆరుగురి అరెస్టు

17-10-2025 12:15:23 AM

-పరారీలో ముగ్గురు నిందితులు

-వివరాలు వెల్లడించిన  మణుగూరు డీఎస్‌పీ

అశ్వాపురం, అక్టోబర్ 16 (విజయక్రాంతి) : నకిలీ బేబిలులతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 8 మందిని అరెస్టు చేసినట్లు మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి తెలిపారు. గురువారం అశ్వాపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈనెల 8వ తేదీన జగ్గారం క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీల్లో భాగంగా TS30TA 6498 అనే నంబర్ గల లారీ ఇసుక లోడుతో రాగా దానిని తనిఖీ చేయగా దాని డ్రైవర్ నాతి రాములు వేబిల్లును చూపించినాడు.

దానిపై అనుమానం వచ్చి గట్టిగా అడగగా అది నకిలీ వే బిల్ అని దాన్ని తమ ఓనరు హైదరాబాద్ నకు చెందిన కర్నాటి శివశంకర్ ఇచ్చి పంపినట్లు అంగీకరించారు. అలాగే రామానుజవరం ర్యాంపులో ఒక వ్యక్తి తనకు డి డి లేకుండా ఇసుక లోడ్ చేసినాడని తెలిపినాడు. దీనిపై లారీని సీజ్ చేసి cr. no. 189/2025 U/Sec 318(4), 336(2), 340(2) ,r/w 3 (5) of BNS, కేసు నమో దు చేశామన్నారు.

రామానుజవరం ఇసుక ర్యాంపు నందు తనిఖీ చేయగా అక్కడ పనిచేసే టీజీఎండిసి కి సంబంధించిన ముగ్గురు ఉద్యోగులు దగ్గు నిఖిల్ దీప్,నాగేల్లి మధు, బుల్లెద్దు అనిల్ అనువారు డిడి లేకుండా ఇసుకను లారీలో లోడ్ చేస్తున్నారని, ఇసుకను లోడ్ చేసే జెసిబి డ్రైవర్ ఇరగదిండ్ల ఉపేందర్ దానిని లోడ్ చేసినాడని అతనికి లోడ్ చేయమని ర్యాంపులో సూపర్వైజర్ గా పని చేసే సతీష్ రెడ్డి ఫోన్ చేసి చెప్పినట్లు వివరించారు. అలాగే కర్నాటి శివశంకర్ గురించి తెలుసుకొని హైదరాబాద్ హయత్ నగర్ లోని అతని ఇంటి వద్దకు వెళ్లగా నేరం ఒప్పుకొని వే బిల్లులు తానే తయారు చేసే వాడిని దానికి ఉపయోగించే లాప్టాప్, ప్రింటర్ అలాగే రామానుజవరం సంబంధించిన స్టాంపును స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.

శివశంకర్ తనకు వే బిల్లు తయారు చేయడంలో తన ఊరు సంస్థాన్ నారాయణపురం మండలం యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకకు చెందిన కిరణ్ అనే అతను వే బిల్లులు తయారు చేయడం నేర్పించినాడని, అంతకు ముందు కిరణ్ పై 2023వ సంవత్సరంలో నకిలీ వే బిల్లుల తయారు చేసినందుకు వరంగల్ జిల్లా మట్వాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయి జైలుకు కూడా వెళ్లినాడని తెలిపినాడు. తాను కిరణ్ కలిసి పలు రీచ్లకు సంబంధించిన నకిలీ వే బిల్లులు తయారు చేసి పలుమార్లు ఇసుక అక్రమ రవాణా చేసినామని తెలిపినాడు.

అరెస్టయిన వారు వీరే..

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం పుట్టపాక గ్రా మానికి చెందిన కర్నాటి శివశంకర్, యా దాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్  నారాయణపూర్ మండల్ జనగాం గ్రామానికి చెంది న నాతి రాములు, మహబూబాబాద్ జిల్లా బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన ఇరగదిల్ల ఉపేందర్, హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుల్లా గ్రామానికి చెందిన దగ్గు నిఖిల్దీప్, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం, అమీనాపురం గ్రామా నికి చెందిన నాగేల్లి మధు, మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అమీనా పురం గ్రామానికి చెందిన బుల్లెద్దు అనిల్ అరెస్టు చేశామన్నారు. మరో ముగ్గురు ఈ కిరణ్, సతీష్ రెడ్డి, సర్వే శ్రీకాంత్ (లారీ ఓనర్,) పరారీ లో ఉన్నట్లు డిఎస్పి తెలిపారు.

ఎవరైనా నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా చేసినా,చేయాలని చూసినా వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది.ఈ కేసులో ఇంకా కొంతమంది అరెస్టు కావలసి ఉన్నందున ఈ కేసులో ఎవరికైనా ప్రమేయం ఉంటే వారిని అరెస్టు చేయడం జరుగుతుంది.ఈ కేసుకు సంబంధించిన వివరములు గాని నకిలీ వే బిల్లుల గురించిన వివరములు గాని ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే  అశ్వాపురం SHO సెల్ No. 8712682093, మణుగూరు సెల్ నెంబర్. 8712682006ని సంప్రదించాలన్నారు.