calender_icon.png 29 October, 2025 | 12:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మద్దతు ధరకు పత్తి కొనుగోలు చేయాలి

29-10-2025 12:30:33 AM

కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశం

నిర్మల్, అక్టోబర్ 28 (విజయక్రాంతి): జిల్లాలో పత్తి పంట కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశిం చారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో సంబంధిత శాఖాధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పత్తి కొనుగోళ్లు జరిగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించా రు.

సీసీఐ (CCI) సంస్థ సమయానికి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతుల నుండి పత్తి పంటను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు. ఆన్లైన్ స్లాట్ బుకింగ్ సౌకర్యం కోసం అందుబాటులోకి తీసుకువచ్చిన కపాస్ కిసాన్ యాప్ ద్వారా రైతులు పత్తి అమ్మకానికి సంబంధించిన స్లాట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపారు.

యాప్ వినియోగంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. రైతు వేదికల ద్వారా, గ్రామాల్లో ఎవోలు, ఎఈవోలు రైతులకు కపాస్ కిసాన్ యాప్ వినియోగం గురించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని ఆదేశించారు. 

రైతులు తేమ శాతం కారణంగా నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వారి పంటకు ఖచ్చితంగా మద్దతు ధర అందేలా చూడాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, కాటన్ పర్చేసింగ్ ఆఫీసర్స్ ఓం బూట్లే, ఈరన్నతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.