calender_icon.png 29 October, 2025 | 2:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పారదర్శక పాలనే లక్ష్యం : కలెక్టర్ భదావత్ సంతోష్

29-10-2025 12:28:48 AM

 నాగర్ కర్నూల్ అక్టోబర్ 28 (విజయక్రాంతి); నాగర్ కర్నూల్ కలెక్టర్ కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాల సందర్భంగా మంగళవారం సత్యనిష్ఠ ప్రతిజ్ఞ కార్యక్రమం జరి గింది. కలెక్టర్ బాదావత్ సంతోష్ మాట్లాడుతూ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీ, పారదర్శకత, జవాబుదారీతనంతో ప్రజలకు సేవలందించాలన్నారు.అవినీతికి తావు లేకుండా సమర్థ పాలనకోసం అందరూ కృషి చేయాలన్నారు. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2 వరకు విజిలెన్స్ వా రో త్సవాల సందర్భంగా క్విజ్ పోటీలు, వాక్థాన్లు, మారథాన్లు, గ్రామసభలు నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ వారోత్సవాల పోస్టర్ను ఆవిష్కరించారు. వారితో పాటు అదనపు కలెక్టర్ అమరేందర్, విజిలెన్స్ ఇన్స్పెక్టర్ సురేందర్ రెడ్డి, విజయ్ కుమార్, ఏడి అగ్రికల్చర్, కలెక్టరేట్ ఏవో చంద్రశేఖర్, వివిధ శాఖల జిల్లా అధికారులుపాల్గొన్నారు.