18-10-2025 12:04:18 AM
మరిపెడ,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామపంచాయతీ శివారులో బతుకు దెరువు కోసం కూలి పనులు చేసుకునేందుకు ఆటోలో వెళ్తుండగా ఆటో పల్టీ కొట్టి ఆరుగురికి గాయాలైన సంఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గిరిపురం గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చిన్న గూడూర్ మండలం ఉగ్గంపల్లి గ్రామానికి చెందిన 19 మంది కూలీలు కలిసి సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలంకు పత్తి ఏరడానికి వెళ్తుండగా. మరిపెడ మండలంలోని గిరిపురం గ్రామంలో ఆటో కు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గంగాధరి మంగమ్మ ,(45) కాలు ఇరుగగా సుకుణమ్మ (50) కాంతకు తగిలింది.
అనసూర్య గూడా ఇరిగింది (40) తీవ్ర గాయలు కాగా గిరిపురం గ్రామ పార్టీ అధ్యక్షుడు కొండయ్య మానవత్వం కున్నరు.మహబూబాబాద్ జిల్లా ఏరియా హాస్పిటల్ కి 108 లో తరలించారు. మల్లయ్యా (60) పిచ్చమ్మ (50) మమత (30) స్వల్ప గాయాలైనట్టు సమాచారం. మిగిలిన వారికి ఎటువంటి గాయకులు కాలేదని సమాచారం. నాలుగు రోడ్లు సమీపంలో కావడంతో మరిపెడ నుండి గిరిపురం వస్తున్న ఆటో , మరో ఆటో ఆనేపురం నుండి కూలీల ఆటో డ్రైవర్ స్పీడ్ గా వెళ్తున్న క్రమంలో మరిపెడ నుండి గిరిపురం వస్తున్న ఆటో దగ్గరకు వచ్చాక కనిపించడంతో దాన్ని తప్పించే క్రమంలో ఆటో డ్రైవర్ సడన్ బ్రేక్ వేశారు. దీంతో ఆటో పల్టి కొట్టినట్లు తెలుస్తోంది.