18-10-2025 12:04:04 AM
మరిపెడ, అక్టోబర్ 17 (విజయక్రాంతి) ః మహబూబాబాద్ జిల్లా మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో డాక్టర్ గుగులోతు రవి ఆధ్వర్యంలో కార్డి యోపల్మనరీ రిసెస్సిటేషన్ (సీపీఆర్)పై పోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నాగేశ్వ రావు శుక్రవారం నాడు మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో పనిచేసే సిబ్బందికి అవగాహనకల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ నాగేశ్వరావు మాట్లాడుతూ అత్య వసర పరిస్థితుల్లో ఎవరైనా స్పృహతప్పి శ్వాసతీసుకోడంలో ఇబ్బందిపడే పరిస్థితు లు ఎదురైనప్పుడు గుండె ఊపిరితిత్తుల మధ్యలో రక్తప్రసరణ సరిగా జరిపించేం దుకు, మెదడుకు రక్తప్రసరణ జరిగేలా సీపీఆర్ దోహదపడుతుందని తెలిపారు.
ఆకస్మిక గుండెపోటు వచ్చినప్పుడు అత్యవ సర వైద్య చికిత్స ద్వారా గుండె తిరిగి కొట్టు కునే వరకు సిపిఆర్, మెదడు, ఇతర అవయ వాలకు ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తాన్ని ప్రవహించేలా చేస్తుంది. గుండె ఆగిపోయి నప్పుడు శరీరానికి ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తము లభించదు. ఆక్సిజన్ అధికంగా ఉన్న రక్తం లేకపోవడం వల్ల కొన్ని నిమిషాలలో మెదడు దెబ్బతింటుంది. అందువల్ల సిపిఆర్ అవగాహన ప్రతి ఒక్కరికి అవసరమని, ఎలా సిపిఆర్ చేయాలో శిక్షణ ఇచ్చి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ స్వామి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ కమల, పబ్లిక్ హెల్త్ నర్సింగ్ ఆఫీసర్ మంగమ్మ, సూపెర్వైసోర్స్ కృష్ణ, సుదర్శన్, లక్ష్మికుమారి, మాధవి, పల్లె దవాఖాన సిబ్బంది సిరి, ఉపేంద్ర, సతీష్, సాయిశ్రీ, సౌజన్య, అఖిల, సరిత, హెల్త్ అసిస్టెంట్, ఏ యన్ యం, ఆశ ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.
చిట్యాల మండలం కేంద్రంలో..
చిట్యాల, అక్టోబర్ 17 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు 108 సిబ్బంది సిపిఆర్ ఫై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినప్పుడు తక్షణం సిపిఆర్ ఎలా చేయాలో వివరా త్మకంగా చేసి చూపించారు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడం, గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు ఛాతిపై గట్టిగా నొక్కడం ద్వారా అలాగే కృత్రిమ శ్వాస అందించడం ద్వారా మరల గుండె పనిచేసేటట్లుగా చేయొచ్చని తెలిపారు. అలాగే అంబులెన్స్ లో ఉన్నటు వంటి అత్యాధునిక పరికరాల గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో 108 అంబులెన్స్ సిబ్బంది టెక్నీషియన్ టి.నగేష్ కుమార్, పైలెట్ రాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విద్యార్థులకు అవగాహన
వెంకటాపురం (నూగూరు), అక్టోబర్ 17 ( విజయక్రాంతి): సిపిఆర్ పై కళాశాల, హైస్కూల్ విద్యార్థులకు శుక్రవారం వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు అవగాహన కల్పించారు. ఏదైనా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాత శిశు సంరక్షణ వైద్యాధికారి భాస్కర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వయసుతో సంబంధం లేకుండా చాలా మంది హార్ట్ ఎటాక్ తో చనిపోతున్నారని, గుండెపోటు వచ్చిన వారికి సి పి ఆర్ అనేది కీలక పాత్ర పోషిస్తుందని, ఈ ప్రక్రియపై ప్రతి ఒక్కరూ చైతన్యం పొందాలన్నారు.
గుండె ఆగిపోవడం,శ్వాస తీసుకుని ఇబ్బంది కలుగుతున్నప్పుడు సిపిఆర్ చేపడితే రక్తప్రసరణ జరిగి ప్రాణాలు నిలుపుకో వచ్చని వైద్య అధికారి విద్యార్థులకు తెలిపారు. ఈ మధ్యకాలంలో గుండెపోటు మరణాలు పెరిగాయని, దీనిపై అందరూ అవగాహన పెంచుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూనియర్ కాలేజీ లెక్చరర్స్, జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినులు పాల్గొన్నారు. వైద్యాధికారి భాస్కర్, హెచ్ ఈ ఓ కోటిరెడ్డి, స్టాఫ్ నర్స్ స్వప్న,, ఏఎన్‌ఎం భారతమ్మ, హెల్త్ అసిస్టెంట్ రాఘవులు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.