calender_icon.png 5 September, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల మానసిక ఆరోగ్య సమస్యలకు కౌన్సెలింగ్

04-09-2025 12:39:01 AM

శ్రీరంగాపురం, సెప్టెంబర్ 3. మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో బుధవారం విద్యార్థులకు మానసిక ఆరోగ్య కార్యక్రమం, ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా మానసిక ఆరోగ్య నిపుణురాలు డాక్టర్ పుష్పలత, శ్రీరంగాపురం PHC డాక్టర్ రాముడు, జిల్లా మానసిక ఆరోగ్య కార్యకర్తలు పాల్గొని కస్తూర్బా గాంధీ పాఠశాల విద్యార్థినిలకు మానసిక స్థితిపై పరీక్షా విధానం పెట్టడం జరిగింది.

ఈ పరీక్షలో కొంతమంది విద్యార్థులకు వారి మానసిక స్థితిపై వారు రాసిన ఆన్సర్ ఆధారంగా మానసిక ఆరోగ్య బృందం ప్ర తి ఒక్కరికి విడివిడిగా మానసికంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా మానసిక వైద్య నిపుణురాలు డాక్టర్ పుష్పలత మాట్లాడుతూ మానసిక ఆరోగ్య సమస్యలు సాధారణ జనాభాలో ఉన్నట్లే విద్యార్థులలో కూడా సర్వసాధారణమని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం ఎస్‌ఓ వాణి, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.