04-09-2025 12:37:27 AM
- గ్రామ పాలనాధికారుల నియామక పత్రాల అందజేత ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సిసిఎల్‌ఏ
- సీసీఎల్‌ఏ లోకేష్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జిల్లా కలెక్టర్
ఖమ్మం, సెప్టెంబర్ 03 (విజయ క్రాంతి): సెప్టెంబర్ 5వ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా హైదరాబాద్ లో జీపీఓలకు అందించే నియామక ఉత్తర్వు పత్రాల పంపి ణీ పై చేయవలసిన ఏర్పాట్ల పై రెవెన్యూ సీసీఎల్‌ఏ కార్యదర్శి లోకేష్ కుమార్ బుధవారం జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు (రెవెన్యూ) తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించా రు. ఇట్టి వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం జి ల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి తో కలిసి కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి పాల్గొన్నారు.
గ్రామపాలనాధికారి పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన అ భ్యర్థులకు ఈ నెల 5వ తేదీన హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీ దుగా నియామక ఉత్తర్వు పత్రాలు అందించనున్నట్లు సిసిఎల్‌ఏ అన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కార్యక్రమ ఏ ర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, జీపీఓ అభ్యర్థులకు నియామక పత్రాలు హైదరాబాద్ లో అందజేయనున్న సందర్భంగా అభ్యర్ధుల హాజరుకు ఏర్పాట్లు సజా వుగా చేయాలన్నారు.
భూ భారతి చట్టం అమలులో భాగంగా జీపీఓల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 5 వ తేదీన హైదారాబాద్ మాదాపూర్లోని హెచ్‌ఐసీసీ లో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 307మందిని హైదరాబాద్ లో జరి గే కార్యక్రమంలో నియామక పత్రాలు అం దుకుంటారన్నారు. 6 ప్రత్యేక బస్ లలో వా రిని నిర్ణీత సమయానికి కార్యక్రమానికి తీసుకెళ్ళేందుకు భోజనం, వసతులు సమకూర్చినట్లు వివరించారు.
307 మంది గ్రామ పాలానాధికారులకు వారి సొంత మండలంలో కాకుండా ఇతర మండలాల లో నియమించేందుకు గురువారం జిల్లా కలెక్టరేట్ లో కౌన్సిలింగ్ ద్వారా ఎంపికైన క్ల స్టర్లకు ఉత్తర్వులు ఇస్తామని కలెక్టర్ వెల్లడించారు. హైదరాబాద్ లో జరిగే కార్యక్ర మానికి సంబంధించిన సమాచారాన్ని జిల్లాల్లోని మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులకు ఇవ్వాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమీక్ష లో డీఆర్‌ఓ ఏ. పద్మశ్రీ, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాస్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.