17 April, 2026 | 10:34 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

బాధిత కుటుంబాలకు పరామర్శ

13-06-2025 12:32 AM

రాజంపేట జూన్ 12 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం బస్వన్న పల్లి గ్రామానికి చెందిన తాతా మనవడు ఇటీవల బస్సు ప్రమాదంలో మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు గురువారం వారి కుటుంబాన్ని  పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని తెలిపారు.

ఇదే గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త కావేటి సంతోష్ ఆక్సిడెంటలో వారి కుమారుడికి గాయాలు అవ్వడంతో వారిని కూడా పరామర్శిం చారు. ఆర్గోoడ గ్రామంలో అప్పుల బాధతో చెట్టుకు ఉరేసుకుని చనిపోయిన జంగిటి పెంటయ్య కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆర్థిక సాయం అందజేసినట్లు మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ఎర్ర ప్రణీత్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో మండల యూత్ ప్రెసిడెంట్ సల్మాన్, మండల నాయకులు శ్రీధర్, వినోద్, సంజీవరెడ్డి, సంతోష్ రెడ్డి, జైసింహా రెడ్డి, శివయ్య,ఎయమ్ సి డైరెక్టర్ సాయగౌడ్, గ్రామాల అధ్యక్షులు  శ్రీనివాస్ రెడ్డి , విజయ్ రెడ్డి, యూత్ అధ్యక్షులు నరేష్, భాస్కర్,సీనియర్ నాయకులు నారాయణ, శ్యామ్, శశికాంత్ రెడ్డి,సాయిబాబు , శ్రీనివాస్, రవి, మండల నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.