calender_icon.png 4 May, 2025 | 6:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

'నీట్‌’ పరీక్ష కేంద్రాలను పరిశీలించిన సీపీ, కలెక్టర్

03-05-2025 05:59:59 PM

మంచిర్యాల (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణ కేంద్రంలో ఈ నెల 4న నిర్వహించనున్న నీట్‌ పరీక్షా కేంద్రాలను మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్(Collector Kumar Deepak), రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా(CP Ambar Kishor Jha)లు పరిశీలించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన నాలుగు పరీక్ష కేంద్రాలైన రాజీవ్ నగర్ లోని తెలంగాణ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్), జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, జిల్లా పరిషత్ బాలికల పాఠశాల, డిగ్రీ కాలేజ్ లోని పరీక్షా కేంద్రాలను పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు. మంచిర్యాలలో నాలుగు సెంటర్లలో నీట్ పరీక్షను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించడంలో భాగంగా సెంటర్లను విజిట్ చేశామన్నారు.

నాలుగు సెంటర్లలో 1,224 మంది విద్యార్థులు పరీక్ష రాయానున్నారని, వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ సమస్య లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. పరీక్ష కేంద్రాల చుట్టుపక్కల ఏరియాలలో 163 బిఎన్ఎస్ఎస్ ప్రకారం నలుగురు కంటే ఎక్కువ మంది ఉండకుండా చూస్తామన్నారు. పోలీస్ సిబ్బంది జాగ్రత్తగా బయట వారిని తనిఖీ చేసి లోపలికి పంపడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాల వద్ద బందోబస్త్ పటిష్టంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. విద్యార్థులు సెంటర్‌లోకి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకెళ్లొద్దని, విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అనుమతి సమయం కన్నా ముందుగా వచ్చి పోలీస్ కీ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, మంచిర్యాల పట్టణ సీ ఐ ప్రమోద్ రావు, ఇన్స్పెక్టర్ పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.