03-05-2025 05:57:23 PM
నిర్మల్ (విజయక్రాంతి): యాసంగిలో రైతులు పండించిన వరి ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం మాత్రమే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ భీమ్ రెడ్డి, ఎఫ్ఎసిహెచ్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్లు అన్నారు. నిర్మల్ రూరల్ మండలంలోని మేడిపల్లి చిట్యాల ముజిగి తాంష గ్రామాల్లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేసుకుంటున్నామని తెలిపారు. రైతులు పంటను దళాలను విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోని విక్రయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఈటెల శ్రీనివాస్ నాయకులు ఇమ్బరి నారాయణ పద్మాకర్ రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.