03-05-2025 06:01:58 PM
నిర్మల్ (విజయక్రాంతి): పోలీస్ శాఖ లో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉంటూ శాంతి భద్రతల పర్యవేక్షణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలో పోలీసు బలగాల పెరేడ్ ను పరిశీలించి గౌరవ వందలను స్వీకరించిన అనంతరం జిల్లాలో పోలీసు వ్యవస్థ ప్రజలకు రక్షణగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులై ఉండి సమాజ అభివృద్ధి కోసం పోలీస్ శాఖ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పి రాకేష్ మీనా సిఐలు ప్రవీణ్ కుమార్ గోవర్ధన్ రెడ్డి కృష్ణ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.