calender_icon.png 24 January, 2026 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాపై 7 కేసులను బయట పెట్టు!

24-01-2026 01:09:58 AM

రెండు రోజుల్లోగా పూర్తి వివరాలు ఇవ్వాల్సిందే

బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు సీపీ సజ్జనార్ నోటీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 23 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు వేళ హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సిట్ చీఫ్ సజ్జనార్, మాజీ ఐపీఎస్ అధికారి, బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌ల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. సజ్జనార్‌పై ఏడు క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ చేసిన ఆరోపణలపై స్పందించిన సజ్జనార్.. వాటిని నిరూపించాలంటూ శుక్రవారం నోటీసులు జారీ చేశారు.

‘నాపై ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయని మీరు బహిరంగంగా ఆరోపించారు. ఆ కేసులు ఎక్కడ నమోదయ్యాయి. వాటి పూర్వాపరాలేంటి. స్పష్టమైన, నిర్దిష్టమైన వివరాలను అందించాలి’ అని సజ్జనార్ ఆ నోటీసులో డిమాండ్ చేశారు. నోటీసు అందిన రెండు రోజుల్లోగా పూర్తి ఆధారాలను తన ముందు ఉంచాలని డెడ్ లైన్ విధించారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవనే సంకేతాలను పరోక్షంగా ఇచ్చారు.