calender_icon.png 24 January, 2026 | 6:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫోన్‌ట్యాపింగ్ చట్టబద్ధమే!

24-01-2026 01:07:20 AM

ఇదే విషయం పార్లమెంట్ సాక్షిగా మాజీ ప్రధాని వెల్లడి

ఫోన్ ట్యాపింగ్ కేసును విచారించే అర్హత సజ్జనార్, శివధర్‌రెడ్డిలకు లేదు

సజ్జనార్‌పై ౭ క్రిమినల్ కేసులు ఉన్నాయి: బీఆర్‌ఎస్ నేత ఆర్‌ఎస్పీ 

హైదరాబాద్, జనవరి 23 (విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధమే అని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. దేశభద్రత విషయంలో ట్యాపింగ్ చేయొచ్చని చట్టమే చెబుతోందని, ఇదే విషయాన్ని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా వెల్లడించారని ప్రవీణ్‌కుమార్ గుర్తు చేశారు. అంత్యంత రహస్యంగా ఉండాల్సిన నిఘా వ్యవస్థలను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వికృత క్రీడతో దిగజారుస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన హైదరాబాద్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 

అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని..

ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, తెలంగాణ సంపదను పక్క రాష్ట్రాలకు రేవంత్‌రెడ్డి కట్టబెడుతు న్నారని ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీ నా యకులు గెస్ట్ హౌస్‌లలో దోపిడీ చేస్తున్నారని, తుపాకులు పెట్టి పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారని, బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు బయట పెడుతుంటే కుట్ర పూరితంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు.  బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను వేధించేందుకు రేవంత్ రెడ్డి అక్రమ సిట్‌ను ఏర్పాటు చేశారని మండిపడ్డారు.

సజ్జనార్ సిట్ అధికారిగా ఉన్నారని, కానీ ఈ కేసును విచారించే అర్హత ఆయనకు లేదన్నారు. సజ్జనార్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయని, కేసును విచారించే అర్హ త సజ్జనార్, శివధర్ రెడ్డిలకు లేదన్నారు. లోతైన విచారణ సజ్జనార్‌పై జరగాలని, ఎందుకంటే, ఆయనపై 7 కేసులు ఉన్నాయన్నారు. రేవంత్‌రెడ్డి రాజకీయ క్రీడలో పోలీస్ అధికారులు బలికావద్దని సూచించారు.